Site icon Prime9

Ram Charan: ‘గేమ్‌ ఛేంజర్‌’గా రామ్‌చరణ్‌.. అదరగొట్టేలా టైటిల్‌ లోగో

ram charan

ram charan

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చరణ్ కెరీర్‌లో 15వ సినిమాగా వస్తున్న ఈ సినిమా టైటిల్ విడుదలైంది.

టైటిల్ ఇదేనా.. (Ram Charan)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చరణ్ కెరీర్‌లో 15వ సినిమాగా వస్తున్న ఈ సినిమా టైటిల్ విడుదలైంది. ఈ సినిమాతో చరణ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. 2024 సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

 


దీంతో రామ్ చరణ్ అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న మెగా అభిమానుల కోసం అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఇక ఈ సినమాకు ‘గేమ్‌ ఛేంజర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు రామ్‌చరణ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం ఉదయం చిత్రబృందం టైటిల్‌ను ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తోంది. శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జే.సూర్య, సునీల్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Exit mobile version