Ram Charan Gets Emotional After Hitting Jr NTR: రెండేళ్ల క్రితం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా కీర్తిని ఆస్కార్ వరకు తీసుకువెళ్లింది. వివిధ క్యాటగిరిలో ఈ సినిమా ఆస్కార్ వరకు వెళ్లడం.. ఇందులో నాటు నాటు పాట ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకోవడంతో ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూసేల చేసింది ‘ఆర్‌ఆర్‌ఆర్’. బాహుబలి తర్వాత జక్కన్న తెరకెక్కించిన చిత్రమిది.
భారీ బడ్జెట్‌తో మూడేళ్ల పాటు రూపొందిన ఈ సినిమా 2022 మార్చి 25న విడుదలై అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను స్క్రీన్‌కే కట్టిపడేసింది. తెరపై ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తమ యాక్షన్, ఎమోషన్స్, రౌద్రంతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారు. మూడు గంటల పాటు వెండితెరపై ప్రేక్షకుడికి వినోదం అందించిన ఈ అద్భుతాన్ని మలచడానికి కాస్ట్, క్రూ పడ్డ కష్టాన్ని డాక్యుమెంటరీ ద్వారా ప్రేక్షకుల ముందకు తీసుకువచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ (RRR: Behind and Beyond)పేరుతో డిసెంబర్ 20న సెలక్టివ్ థియేటర్‌లో విడుదలైంది. వారం రోజులకే డిసెంబర్ 20న ఈ డాక్యుమెంటరీ ఓటీటీకి వచ్చింది.
I want to thank whoever decided to make this documentary about the making of the best movie ever. You must watch this! Every person in the entire world should watch this.#RRRBehindAndBeyond pic.twitter.com/W1zF7VZouu
— Tarak Forever (@Charanlucky22) December 27, 2024
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ బాండింగ్ ప్రతి ఒక్కరి ఆకట్టుకుంటుంది. సినిమా షూటింగ్ టైంలో ఇద్దరు ఒకరిపై ఒకరు చూపించిన ప్రేమ, ఎమోషన్స్ వారి అభిమానుల చేత కంటతడి పెట్టిస్తుంది. ముఖ్యంగా కోమురం భీముడో పాటలో చరణ్, ఎన్టీఆర్‌ను కొరడాతో కొట్టే సీన్ అయిపోయాగానే రామ్ చరణ్.. ఎన్టీఆర్‌ని పట్టుకుని ఎమోషలైన తీరు ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుంది. ఇందుకు సంబంధించిన క్లిప్స్ నెటిజన్లు షేర్ చేస్తూ ఈ డాక్యుమెంటరీని తీసుకువచ్చిన టీం ధన్యవాదాలు తెలుపుతున్నారు.
కాగా ఆర్‌ఆర్‌ఆర్ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, బ్రిటిష్ నటి ఓలివియా మోరిస్‌లు పీమేల్ లీడ్ రోల్లో కనిపించగా.. శ్రీయా, అజయ్ దేవగణ్, సముద్రఖనితో పాటు పలువురు హాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. 2022లో విడుదలైన ఈ భారీ కలెక్షన్స్ చేస్తూ రికార్డులు క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ. 1300పైగా కోట్ల గ్రాస్ చేసింది. ఆస్కార్‌తో పాటు పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ని కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై హాలీవుడ్ దిగ్గజ దర్శకుల సైతం ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల యాక్టింగ్ వారిని కట్టిపడేసింది. అలా ఇంటర్నేషనల్ వేదికపై ఎన్నో అవార్డులు అందుకుంది ఈ ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం.