Site icon Prime9

Rajinikanth: కూతురు డైరక్షన్ లో రజనీకాంత్

Rajinikanth

Rajinikanth

Kollywood: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లైకా ప్రొడక్షన్ హౌస్‌తో రెండు చిత్రాలకు సంతకం చేసి ఈ సంస్దతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ఒక సినిమాకు ఆయన మరో కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తుందని సమాచారం.

కొన్ని నెలల క్రితం తన రెండవ కొడుకును ప్రసవించిన సౌందర్య రజనీకాంత్, ఈ లైకా ప్రొడక్షన్ చిత్రాలలో ఒకదానితో తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. మరో చిత్రానికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలను తలైవర్ 170 మరియు తలైవర్ 171 గా పిలుస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌తో రజనీకాంత్ కు ఇవి మూడవ మరియు నాల్గవ ప్రాజెక్టులు. ఈ వార్తను సోషల్ మీడియాలో ప్రకటిస్తూ ప్రొడక్షన్ హౌస్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మెగాస్టార్‌తో పాటు టీమ్ ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో లైకా ప్రొడక్షన్స్ అధినేత తమిళకుమారన్, లైకా చైర్మన్ సుభాస్కరన్, డిప్యూటీ చైర్మన్ ప్రేంశివస్వామి ఉన్నారు. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నవంబర్ 5 న చెన్నైలో జరుగుతాయి.

రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో శివ రాజ్‌కుమార్‌తో పాటు జైలర్‌తో బిజీగా ఉన్నారు. మరోవైపు, లైకా ప్రొడక్షన్స్ చేతిలో కూడా కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు ఉన్నాయి. ఇందులో 2023 ద్వితీయార్థంలో విడుదలయ్యే పొన్నియన్ సెల్వన్ 2, కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఇండియన్ 2 ఉన్నాయి.

Exit mobile version