Site icon Prime9

Project K: ప్రాజెక్ట్ Kలో విలన్స్ వీరే.. స్క్రాచ్ వీడియో విడుదల చేసిన మేకర్స్

project K

project K

Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా థియేటర్ల వద్ద సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మరో పక్క సలార్, ప్రాజెక్ట్ K,మారుతి సినిమాలు కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే వీటిలో సలార్, ప్రాజెక్ట్ K మూవీలపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయనే చెప్పాలి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K తెరకెక్కుతోంది.

ప్రస్తుతం ప్రాజెక్ట్ K షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ తారాగణం అయిన అమితాబ్, దీపికా పదుకొనే, దిశా పఠాని ఇలా ప్రముఖ స్టార్స్ నటిస్తున్నారు. సినిమాలో గ్రాఫిక్స్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతున్నట్టు సమాచారం. ఇక ఇటీవలె ఈ మూవీ నుంచి స్క్రాచ్ ఎపిసోడ్ అంటూ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్. ఆ వీడియో సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. కాగా తాజాగా ప్రాజెక్ట్ K నుంచి స్క్రాచ్ ఎపిసోడ్ 2 అంటూ మరో వీడియోని రిలీజ్ చేశారు చిత్ర బృందం.

రైడర్స్ అంటే ఎవరు(Project K)..

ఈ వీడియోలో రైడర్స్ ఎవరు అంటూ అక్కడ ఉండే వారి మధ్య డిస్కషన్ నడుస్తుంది. కాగా చిత్రయూనిట్ ఆ రైడర్స్ గురించి ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. లాస్ట్ కి రైడర్స్ మేకింగ్ వీడియోని చూపించారు. గ్రాఫిక్స్ లో రైడర్స్ అనే టీం సభ్యులు ఎలా తయారు చేశారు, షూటింగ్ ఎలా జరుగుతుంది అనేది వీడియో ద్వారా చూపించారు. ఇక ఈ వీడియో చూశాక రైడర్స్ అనే వాళ్లు ఈ సినిమాలో విలన్స్ అయి ఉండొచ్చు అని కొంతమంది అంటుంటే మరికొంతమంది ప్రభాస్ తరపున ఉండే సైన్యం అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ మూవీలో రైడర్స్ అనే వాళ్ళు ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రాజెక్ట్ K మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్టు గతంలోనే ప్రకటించారు చిత్రయూనిట్.

Exit mobile version