Site icon Prime9

Puspa-2: పుష్ప-2 డైలాగ్స్ లీక్.. పుష్పరాజ్ పవర్ ఫుల్ డైలాగ్స్ వైరల్

powerfull-dialogues-leaked-from-allu-arjun-pushpa-2-movie

powerfull-dialogues-leaked-from-allu-arjun-pushpa-2-movie

Puspa-2: డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‏లో వచ్చిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో బన్నీకి పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఏర్పడింది. ఇక ఇటీవల పుష్ప చిత్రాన్ని రష్యాలోనూ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్రానికి సిక్వెల్ గా రాబోతున్న పుష్ప 2పై కూడా ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఓకేసారి అన్ని భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 మూవీలో రష్మిక కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి అల్లు అర్జున్ చెప్పే కొన్ని డైలాగ్స్ లీకయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ డైలాగ్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

“అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయి అంటే ?.. పులి వచ్చిందని అర్థం. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం” అనే భారీ లెంగ్త్ డైలాగ్ లీక్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే “వాళ్లు గొర్నెల్ని కాయడానికి వచ్చారు. ఆ గొరెల్ని తినడానికి పులి వస్తే.. దాన్ని వేసేయడానికి నేను వచ్చాను” అంటూ పుష్పరాజ్ చెప్పే డైలాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతే కాక ఇంకాకొన్ని డైలాగ్స్ కూడా రీక్ అయినట్లుగా సమాచారం. అయితే ఈ డైలాగ్స్ లీక్స్ పై ఇప్పటివరకు చిత్రబృందం స్పందించలేదు.

ఇక డిసెంబర్ 16న పుష్ప 2 గ్లింప్స్ విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే భారీ స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా లో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇదీ చదవండి:  చంద్రముఖిగా కాంట్రవర్సీ క్వీన్ కంగనా.. ఫస్ట్ లుక్ రిలీజ్

Exit mobile version