Site icon Prime9

Ustaad Bhagat Singh Poster: ఫ్యాన్స్ ను మోసం చేస్తున్నారా అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ పై విమర్శల వెల్లువ.. ఎందుకంటే..?

Ustaad Bhagat Singh Poster

Ustaad Bhagat Singh Poster

Ustaad Bhagat Singh Poster: టాలీవుడ్ కా బాప్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజకీయాలను ఏకతాటిపై నడిపిస్తూ ప్రజల్లో అమితమైన అభిమానాన్ని సంపాదించుకున్నారు. కాగా ప్రస్తుతం పవన్ స్టార్ అటు ఢిల్లీ టూర్ రాజకీయంగా బిజీగా ఉంటూనే ఇటు వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎలక్షన్స్ టైంలోపు చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ తర్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఇన్నాళ్లు ఆలస్యం అయిన సినిమాలకు వరుసగా డేట్స్ ఇస్తున్నారు పవన్. ఇక ఇటీవలే కేవలం 25 రోజుల్లో వినోదయసిత్తం రీమేక్ షూటింగ్ పూర్తి చేసేశారు పవన్. ఇప్పుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ సినిమాలకు డేట్స్ ఇచ్చేసి సినిమా షూటింగ్ ప్రారంభించినట్టు సినీరంగంలో టాక్ ఉంది.

రెండేళ్లు వాయిదా(Ustaad Bhagat Singh Poster)..

ఇకపోతే రెండేళ్ల క్రితం హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా ఇచ్చిన హరీష్ శంకర్ తో పవన్ మరో సినిమా అనౌన్స్ చేసేసరికి అభిమానులంతా సంతోషంతో పండుగ చేసుకున్నారు. ఈ మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా కావడంతో రాజకీయాల్లో కూడా బిజీ అవడం వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

అయితే తాజాగా అభిమానులంతా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో తీవ్ర నిరాశకనపురస్తున్న తరుణంలో ఆ మూవీకి ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇక రీసెంట్గా బుధవారం నాడు ఈ సినిమా షూట్ మొదలైందని హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. పోలీస్ స్టేషన్ సెట్ లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ మొదలైనట్టు సమాచారం ఇచ్చారు. ఈ మూవీ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ఓ చైర్ లో పోలీస్ గెటప్ లో కూర్చొని ఓ చేతిలో రివాల్వర్, మరో చేతిలో చాయ్ గ్లాస్ పట్టుకొని ఉంటాడు. దానిని వెనుక నుంచి తీసిన ఫోటోని పోస్టర్ గా రిలీజ్ చేశారు. దానితో పవన్ సినిమా నుంచి అప్డేట్ అంటే ఇంక సోషల్ మీడియా ఎంతలా షేక్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫొటో వైరల్ అవుతుండడంతో ఫ్యాన్స్ రెస్పాండ్ అవుతున్నారు. కాగా ఆ ఫొటోలో ఉంది హరీష్ శంకర్ అని, హరీష్ శంకర్ ఫోటో పెట్టి ఫ్యాన్స్ ని మోసం చేయాలనుకుంటున్నారా అంటూ డైరెక్టర్ హరీష్ ని, నిర్మాణ సంస్థ మైత్రిని ట్రోల్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. దీంతో పలువురు నెటిజన్లు ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. మరి కొంతమంది అభిమానులు మాత్రం పవన్ ని కొత్త లుక్ లోకి మార్చారా అని కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version