Kantara: భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ బాలీవుడ్ తమిళ మలయాళం కన్నడ ప్రాంతంలో విజుదలై థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్న కాంతార మూవీ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే ఈ మూవీ ఇటు ప్రేక్షకులనే కాకుండా అటు ప్రభుత్వాన్ని కూడా కదిలించింది. రాష్ట్ర ప్రభుత్వానికే కాక కేంద్రానికి సైతం కాంతార క్రేజ్ పాకిందని చెప్పవచ్చు. ఈ సినిమాను ప్రధాని మోడీ స్పెషల్ స్క్రీన్ పై చిత్ర బృందంతో కలిసి చూడాలని ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. అయితే నవంబర్ 14 ఈ మూవీ ప్రధాని మోదీ చూస్తారని తెలుస్తారని తెలుస్తోంది. కాగా దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
పలు ప్రాంతాల్లోనూ ఈ మూవీకి వస్తున్న ఆదరణను చూసిన కర్నాటక ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. భూతకోల నృత్యకళాకారులకు శుభవార్త చెప్పింది. కాంతార చిత్రంలో ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు మరియు నటుడు అయిన రిషబ్ శెట్టి. ముఖ్యంగా భూతకోల నృత్యకారులను తెరపై చూపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ తర్వాత అనాదిగా వస్తోన్న భూతకోలా సంప్రదాయం గురించి దేశమంతా తెలిసింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ నోట విన్నా ఈ సినిమా గురించే టాక్ వినిపిస్తుంది. దేశమంతటా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తున్న నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 60ఏళ్లు దాటిన అర్హులైన వారందరికీ భూతకోల నృత్యకారులకు నెలకు రూ.2000 ఆర్థికసాయం అందించనున్నట్లు ప్రకటించింది. హిందూ సనాతన ధర్మంలో భాగంగా భూత కోల ఒక ప్రత్యేక దైవారాధనగా ఉందని బెంగళూర్ సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ తెలిపారు. దైవారాధన, భూతకోల నృత్యం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి బీజేపీ ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించేందుకు ముందుకురావడం చాలా గొప్ప విషయమని దీనికి అంగీకరించిన సీఎం బస్వరాజ్ బొమ్మెకి, మంత్రి సునీల్ కుమార్ కాకర్లకు ఆయన ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: కాంతార @ రూ.188 కోట్లు