Site icon Prime9

Chandra Mohan : చంద్రమోహన్ మృతి పై సంతాపం తెలిపిన హీరో పవన్ కళ్యాణ్ ..

pawan kalyan tweet about chandra mohan death

pawan kalyan tweet about chandra mohan death

Chandra Mohan: నటుడు చంద్రమోహన్ తెలుగు, తమిళ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని మెప్పించారు . వయో భారంతో గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రమోహన్ ఇటీవల గుండెకి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరగా నేడు నవంబర్ 11న ఉదయం 9.45 గంటలకు మరణించారు. దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. హీరో చిరంజీవి, పవన్ కళ్యాణ్ , రవితేజ  ఇంకా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా నివాళులు ప్రకటిస్తున్నారు. కొంతమంది ప్రముఖులు ఆయన ఇంటివద్దకు వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు.

చంద్రమోహన్ మృతి చెందిన విషయం తెలిసి ఆవేదన చెందినట్లు హీరో, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈమేరకు జనసేన తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు. ఆపై ఈ ప్రకటనను ట్వీట్ చేస్తూ చంద్రమోహన్ ఆత్మకు శాంతిని ప్రసాదించమని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

 

చంద్రమోహన్ తమ కుటుంబ స్నేహితుడని చెప్పారు. తన అన్నయ్య చిరంజీవితో కలిసి చంటబ్బాయ్, ఇంటిగుట్టు లాంటి సినిమాల్లో నటించారని గుర్తుచేశారు. తన తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’ తో పాటు ‘తమ్ముడు’ సినిమాలో కలిసి నటించినట్లు తెలిపారు.తెరపై చంద్రమోహన్ ను చూడగానే ఎంతగానో పరిచయం ఉన్న వ్యక్తిగా, దగ్గరి బంధువును చూసినట్లుగా అనిపిస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన తనదైన నటనను చూపించారని తెలిపారు. ఎన్నో పాత్రలలో ఆయన ఒదిగిపోయారని, శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యంలో నానావలిగా ఎన్నటికీ గుర్తుండిపోతారని పవన్ కల్యాణ్ చెప్పారు. సుమారు 900 లకు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులలో అన్ని తరాలవారికీ చేరువయ్యారని, చంద్రమోహన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ పేర్కొన్నారు.

Exit mobile version