Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పలసిన పని లేదు. సాధారణంగా అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రమే భక్తులు ఉంటారు. ఈ మాటని పలువురు ప్రముఖులు బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఒక వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు పవన్. రాజకీయాల కారణంగా ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకం అవుతూనే ఉంటున్నారు పవన్. ఇక సోషల్ మీడియా ద్వారా కూడా యాక్టివ్ గానే ఉంటుంటారు.
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా మాద్యమాలు అయిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటూ మూవీ అప్డేట్స్, పర్సనల్ విషయాలను కూడా అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటారు. అయితే ఇన్నాళ్ళూ కేవలం ట్విట్టర్ లోనే యాక్టివ్ గా ఉంటున్న పవన్ కి.. ఇన్‌స్టాగ్రామ్ లో అకౌంట్ లేదు. కాగా ఈ మేరకు పవన్ ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో టాపిక్ నడుస్తూనే ఉంది.
ఇప్పుడు ఇదే క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అఫిషియల్ గా ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లోకి వచ్చాడని తెలియగానే అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు ఆయన్ని ఫాలో అవుతున్నారు. నిమిషం నిమిషంకి పవన్ అకౌంట్ కి ఫాలోవర్స్ భారీగా పెరుగుతున్నారు. తన ట్విట్టర్ అకౌంట్ లో ఉన్న మ్యాటర్ నే ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ లో కూడా పెట్టుకున్నారు. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో..Jai Hind! అని తన అకౌంట్ లో పెట్టుకున్నారు. ఇంకా ఎటువంటి పోస్టులు చేయలేదు. ఒక్కరోజులో ఎంతమంది ఫాలోవర్స్ ని సంపాదించి రికార్డు కొడతారో పవన్ అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక పవన్ మొదటి పోస్ట్ ఏం పెడతాడా అని కూడా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. అయితే పవన్ (Pawan Kalyan) తన ట్విట్టర్ అకౌంట్ లో సినిమాల గురించి మాత్రం పోస్ట్ చేయరు. కేవలం పాలిటిక్స్, జనసేన పోస్టులు మాత్రమే పోస్ట్ చేస్తారు. మరి ఇన్‌స్టాగ్రామ్ లో పవన్ ఎటువంటి పోస్ట్ లు పెడతారో అని సర్వత్రా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.