Site icon Prime9

Yashoda: ఓటీటీలోకి వచ్చేస్తున్న యశోద.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

yashodha-movie-streaming-from-december-9th on amazon prime

yashodha-movie-streaming-from-december-9th on amazon prime

Yashoda: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సరోగసి నేపథ్యంలో నటించిన లేటెస్ట్‌ చిత్రం యశోద. లేడీ ఓరియంటెడ్ గా సాగే ఈ చిత్రంలో సమంత గర్భణి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 11న రిలీజై  బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. కాగా ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్‌ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్‌ సంస్థ దక్కించుకుంది. కాగా ఈ చిత్రం డిసెంబర్‌ 9నుండి స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలోకి రావాల్సి ఉండగా.. ఈ సినిమాపై కొన్ని వివాదాలు నెలకోవడంతో డిజిటల్ రిలీజ్‌కు ఆలస్యమైందని చెప్పవచ్చు. ఈ సినిమాలో ‘ఈవా’ పేరు ఉపయోగించడంతో హైదరాబాద్‌లో ‘ఈవా ఐవీఎఫ్’ ఆసుపత్రి వర్గాలు కోర్టుకు వెళ్ళాయి. ఈ వివాదం కాస్త యశోద సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌‌కు ఆలస్యానికి కారణం అయ్యింది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు లైన్‌ క్లియర్‌ అవడంతో యశోద మూవీని స్ట్రీమింగ్‌ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీబిజీగా గడుపుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ నటించిన ‘శాకుంతలం’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది.

ఇదీ చదవండి: క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన కీర్తి సురేష్..!

Exit mobile version