Site icon Prime9

NBK Unstoppable Season 2: బాలయ్య బాబు సీజన్ 2 ఎంట్రీతో “దెబ్బకు థింకింగ్ మారిపోవాలా”..!

NBK unstoppable season 2

NBK unstoppable season 2

NBK Unstoppable Season 2: బాలకృష్ణ హోస్ట్ గా ఆహా వేదికగా రూపొందించబడిన అన్ స్టాపబుల్ ప్రోగ్రాం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిందనే చెప్పవచ్చు. నందమూరి నటసింహంలోని మరో కోణాన్ని ఈ ప్రోగ్రాం ద్వారా వీక్షించారు ప్రజలు. ఆరుపదుల వయస్సులోనూ చిన్నపిల్లోడిలా అల్లరిచేస్తూ, జోక్స్ వేస్తూ, డైలాగులు చెప్తూ, వచ్చిన గెస్టులనే కాకుండా బాలయ్య అభిమానులను, ప్రేక్షకులను సైతం తన అభినయంతో కట్టిపడేశారు బాలయ్యబాబు. ఇంక ఆ షోలో బాలయ్య చేసిన ఎంటర్ టైన్ మెంట్ అంతా ఇంతా కాదనుకోండి.

ఇంక ఆ షో ఫస్ట్ సీజన్ అయిపోయాక మరల ఎప్పుడెప్పుడు బాలయ్యబాబు అన్ స్టాపబుల్ సీజన్ 2 చేస్తారా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రజానీకం. కాగా ఇటీవలె కాలంలోనే సీజన్ 2 కమింగ్ సూన్ అంటూ ఆహా టీం పోస్టు చేసింది. కానీ, ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే తాజాగా ఆహా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రారంభం కాబోతోందని ట్విట్టర్ వేదికగా పేర్కొనింది.

ఈ సంవత్సరంలోనే పండుగ త్వరలో ప్రారంభం కాబోతున్నట్లుగా వెల్లడించింది. సీజన్ 2తో ‘దెబ్బకు థింకింగ్ మారిపోవాలా’ అంటూ పేర్కొంది. బాలయ్య అభిమానులు ఈ వార్త ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. ఈసారి ఎవరెవరు గెస్ట్ లు గా వస్తారా అని ఆలోచిస్తున్నారు. అన్ స్టాపబుల్ 2 ప్రోగ్రాం మరింత కొత్తగా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. మరింత ఎంటరైన్ మెంట్ తో పాటు రికార్డ్స్ సృష్టించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.  అయితే సీజన్ 2 లో మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తారని టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ లేనప్పటికీ, మెగాస్టార్ వస్తే షో వేరే లెవల్ కు వెళ్తుందని అంటున్నారు మెగా, నందమూరి ఫ్యాన్స్. గతంలో జరిగిన అన్ స్టాపబుల్ మొదటి సీజన్ లో అఖండ టీం, బ్రహ్మానందం, మంచు ఫ్యామిలీ, మహేష్ బాబు, రాజమౌళి, రవితేజ, విజయ్ దేవరకొండతో పాటు పలువురు సెలబ్రెటీలు వచ్చి అలరించారు.

ఇదీ చదవండి: “సీతారామం” సీక్వెల్.. దుల్కర్ సల్మాన్ ఏం చెప్పారంటే..?

 

Exit mobile version