Site icon Prime9

IBomma:: సినీ ప్రియులకు బిగ్ షాక్.. ఇకపై ఐబొమ్మ సేవలు రద్దు

Ibomma OTT prime9 news

Ibomma OTT prime9 news

IBOMMA OTT: ప్రస్తుతం అంతా ఓటీటీ హవా నడుస్తుంది. కాగా ఓటీటీలో సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి. మరి ఈ బాదుడు తట్టుకోలేని సినీ అభిమానులు ఐబొమ్మ పుణ్యమాని ఫ్రీగా ఇంట్లోనే ఎంచక్కా మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకేనేమో మిగిలిన ఓటీటీ ఫ్లాట్ ఫాం లకన్నా ఐబొమ్మకు ఇండియాలో క్రేజ్ ఎక్కువ. అయితే తాజాగా ఐబొమ్మ సినీ లవర్స్ కు బిగ్‌ షాక్ ఇచ్చింది.

ఓటీటీలో విడుదలయ్యిన సినిమాలను పైరసీ రూపంలో సినీ ప్రియులకు ఫ్రీగా అందిస్తూ వచ్చిన ఐబొమ్మ తమ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు పేర్కొనింది. తమ సైట్ ను యూజ్ చేస్తున్న వ్యూవర్లకు ఇటీవల కాలంలో వరుసగా ఆంక్షలు విధిస్తూ వచ్చిన ఐబొమ్మ సెప్టెంబర్ 9 నుంచి సైట్ సేవలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా భవిష్యత్తులోనూ తిరిగి తమ సేవలను అందుబాటులోకి తెచ్చే ఆలోచన లేదని, ఈ విషయమై తమకు ఎవరు మెయిల్స్‌ పెట్టవద్దని కోరింది. ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఐబొమ్మ యూనిట్ తేల్చిచెప్పింది. ఐబొమ్మ తీసుకున్న ఈ నిర్ణయం సినీ లవర్స్ కు పెద్ద షాక్ అనే చెప్పవచ్చు.

ఇదీ చదవండి: అదుర్స్ అనిపిస్తున్న విక్రమ్ వేద ట్రైలర్

Exit mobile version