Site icon Prime9

Unstoppable NBK 2: ఒకె వేదిక పై సందడి చేయనున్న పవన్ కళ్యాణ్, బాలకృష్ణ

nbk prime9new

nbk prime9new

Unstoppable NBK 2: అటు నందమూరి ఫ్యాన్స్ కు, ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆ న్యూస్ ఏంటా అని ఆలోచిస్తున్నారా, నంద‌మూరి బాల‌కృష్ణ‌ మరియు ప‌వ‌ర్ స్టార్ పవన్ క‌ళ్యాణ్ క‌లిసి ఓ వేదిక‌ పై సందడి చేయనున్నారు. ఇప్పటి వరకు వీరిద్ద‌ని ఒకే వేదిక‌ పై మనం ఎప్పుడు చూడలేదు. అలాంటిది ఇప్పుడు ఇద్దరూ ఒకే వేదిక పై కనిపించడమే కాకుండా, బాలకృష్ణ ప్ర‌శ్న‌లు వేయ‌టం, పవన్ కళ్యాణ్ జవాబులు చేస్తుంటే ఉంటుంది. అబ్బో ఇలా చెప్పడం కంటే చూస్తే ఇంకా బావుంటుంది. ఈ విషయం తెలుకున్న పవర్ స్టార్ అభిమానులందరూ పండగ చేసుకుంటున్నారు. పవర్ స్టార్ అభిమానులు ఎంత బలంగా కోరుకున్నారో తెలుస్తుంది.

అసలు వివ‌రాల్లోకి వెళితే, నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా చేస్తోన్న ప్రోగ్రామ్ అన్‌స్టాప‌బుల్ విత్ NBK షో. ఈ షో గతేడాది ఆహాలో గ్రాండుగా లాంచ్ అయి సీజన్ 1 మంచి క్రేజును సంపాదించుకుంది. సీజన్ 1 లో స్టార్ హీరోలంద‌రూ ఈ షోలో పాల్గొన్నారు. ఈ షోలో బాల‌కృష్ణ స్టార్ హీరోలంద‌రని ప్రశ్నలను అడగగా వారందరూ స‌మాధానాలు చెప్పారు. అన్‌స్టాప‌బుల్ విత్ NBK షో సీజ‌న్ 1 ఆల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. దీంతో ఇప్పుడు సీజన్ 2 ఎప్పుడా అని నందమూరి అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. అతి త్వరలో అన్‌స్టాప‌బుల్ ఎన్‌బీకే సీజ‌న్‌ 2 మన ముందుకు రాబోతుందని షో నిర్వాహ‌కులు తెలిపారు.

Exit mobile version