Ott movies: ప్రస్తుతం థియేటర్‌లో ఈ వారం స్టార్ హీరోల సినిమాలేవీ సందడి చేయడం లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం ఆసక్తికర వెబ్ సిరీస్‌లు, సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పలు భాషల్లోని సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
ఓటీటీ చిత్రాలు.. (Ott movies)
ఈ వారం ఓటీటీలో పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఓసారి అవేంటో చూసేయండి.
‘జూబ్లీ’
అదిరిరావు హైదరీ ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించింది. ప్రసేన్‌జిత్ ఛటర్జీ, అపరశక్తి ఖురానా, సిద్ధాంత్ గుప్త, వామికా గబ్బి తదితరులు ఇందులో నటించారు. ఈ వెబ్ సిరీస్ కు విక్రమాదిత్య దర్శకత్వం వహించారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ పై ఈ సిరీస్ ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. సినీ పరిశ్రమ స్వర్ణయుగాన్ని చూసిన రోజుల్లో కొందరు నటీనటుల మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది.
‘రోమాంచమ్’
జితు మాధవన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 7వ తేదీ నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులోకి రానుంది.
‘అయోథి’
శశికుమార్, ప్రీతి ఆశ్రాని కీలక పాత్రల్లో నటించిన యాక్షన్ డ్రామా ‘అయోథి’. గత నెలలో తమిళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ జీ5 ఓటీటీ వేదికగా ఏప్రిల్ 7నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్
బీఫ్ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 6
ఇన్ రియల్ లవ్ (టీవీ షో) ఏప్రిల్ 6
చుపా (హాలీవుడ్) ఏప్రిల్ 7
హంగర్ (హాలీవుడ్) ఏప్రిల్8
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ది క్రాసోవర్ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 4
బ్యాట్‌మ్యాన్ (హాలీవుడ్) ఏప్రిల్ 5
కాస్మోస్ (హాలీవుడ్) ఏప్రిల్ 7
ఆహా తమిళం
బుర్కా (తమిళం) ఏప్రిల్ ౭