Site icon Prime9

Family Star: విజయ్ కి సంక్రాంతి ఆఫర్ ఇచ్చిన బాలయ్య .. ఫుల్ జోష్ లో విజయ్ ఫ్యాన్స్

nanadamuri balakrishna gives festival offer to vijay devarakonda

nanadamuri balakrishna gives festival offer to vijay devarakonda

Family Star: మన టాలీవుడ్ లో ప్రతి హీరో వాల్ల సినిమాలని ఎప్పుడెప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకురావాలా అని ఎదురుచూస్తూ ఉంటారు . అయితే వాల్ల సినిమాని కరెక్ట్ టైమ్ లో రిలీజ్ చేసే ఛాన్స్ వస్తే ఎవ్వరు మిస్ చేసుకోరు. కానీ ఓ సీనియర్‌ హీరో యంగ్‌ హీరోని సంక్రాంతికి నేను రావడం లేదు, ఆ గ్యాప్‌ని నువ్వు వాడుకో అని హార్టఫుల్‌గా విష్‌ చేశారంటేనే, సక్సెస్‌ సగం వచ్చినంత బలంగా ఉంటుంది. అంతటి ఆఫర్ ని పొందడం ఎంత సంతోషంగా ఉంటుందో ఇప్పుడు విజయ్‌ దేవరకొండకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన్ని కమాన్‌ అంటూ ఎంకరేజ్‌ చేస్తున్నది బాలకృష్ణ కాబట్టి.

ఈ సారి అన్‌స్టాపబుల్‌ షోలో పార్టిసిపేట్‌ చేసింది యానిమల్‌ టీమ్‌ అయినా, మన దగ్గర మాత్రం రౌడీ హీరో అభిమానులకు కడుపు నిండిపోయింది. స్క్రీన్‌ మీద రష్మిక, సందీప్‌, బాలయ్య, రణ్‌బీర్‌.. అందరూ విజయ్‌ దేవరకొండ గురించి అన్‌స్టాపబుల్‌గా మాట్లాడుతూనే ఉన్నారు. బాలయ్యయితే , ‘ఫ్యామిలీ స్టార్‌… ఈ సంక్రాంతికి నేను రావడం లేదు. ఆ స్పేస్‌ని నువ్వు వాడుకో’ అని బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు. దీంతో ఫ్యామిలీ స్టార్‌ అభిమానుల జోష్‌ మామూలుగా లేదు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. విజయ్ కి గీతగోవిందం వంటి సూపర్ సక్సెస్ ని అందించిన పరశురామ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఆల్రెడీ ఈ సంక్రాంతికి రావడం పక్కా అని మహేష్‌ మళ్లీ మళ్లీ చెబుతూనే ఉన్నారు. అటు గుంటూరు కారం నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా ఈ పొంగల్‌ తమకు చాలా ఇంపార్టంట్ అంటున్నారు. ఈ సంక్రాంతి మీద ఫుల్‌ ఫోకస్‌తో ఉన్నట్టు, కలెక్షన్లు కుమ్మరిస్తామంటూ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ ఏడాది పండగతో పాజిటివ్‌ హిట్అందుకున్న మాస్‌ మహరాజ్‌, నెక్స్ట్ ఇయర్‌ ఈగిల్‌ మీద ఎక్కువ హోప్సే పెట్టుకున్నారు.భారీ సినిమాల మధ్య బుల్లి హీరో తేజ సజ్జా హనుమాన్‌తో వస్తున్నారు. అటు విక్టరీ హీరో వెంకటేష్‌ అయితే ఒకేసారి రెండు కాలేజీల్లో ప్రమోషనల్‌ యాక్టివిటీస్‌ని ప్లాన్‌ చేస్తూ సైంధవ్‌ కూడా ట్రెండ్‌లోనే ఉంటుంది.

Exit mobile version