Site icon Prime9

Anirudh Ravichander: మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇంట విషాదం

Anirudh grand father passes away

Anirudh grand father passes away

Anirudh Ravichander: తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన తాత సీనియర్ డైరెక్టర్, రేడియో డబ్బింగ్ కళాకారుడు, నటుడు ఎస్వీ రమణన్ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎస్వీ రమణన్  సెప్టెంబర్ 26న కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు 27 సెప్టెంబర్ మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో జరగనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఎస్వీ రమణన్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు. రమణన్ పలు శాఖల్లో పేరు తెచ్చుకున్నారు. రేడియో రంగంలో పలు ప్రయోగాలు చేసి విజయవంతంగా వేలాది రేడియో ప్రసారాలకు డబ్బింగ్ ఇచ్చారు. భక్తిరస లఘు చిత్రాలను రూపొందించారు. గతంలో తన మనవడు అనిరుధ్ చిత్రపరిశ్రమలో మంచి పేరుతెచ్చుకోవడం చూసి మురిసిపోతున్నట్లు రమణన్ చెప్పారు.

ఇదీ చదవండి: సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. దర్శకుడు అశోకన్ కన్నుమూత

Exit mobile version