Site icon Prime9

Ginna Movie Teaser: “వీడేందిరా మనల్ని దొబ్బుతున్నాడు”అంటున్న మంచు విష్ణు

ginna movie teaser prime9news

ginna movie teaser prime9news

Ginna Teaser: మంచు విష్ణు హీరోగా నటించిన సినిమా జిన్నా.ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ మరియు సన్నీలియోన్ కథనాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడుగా  సూర్య తెలుగు సినీ  పరిశ్రమకు పరిచయవుతున్నారు ఈ సినిమాకు రచయిత కోన వెంకట్ కథను, స్క్రీన్‌ప్లే అందించారు. ఎంటర్‌టైన్‌మెంట్‌,24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు మలయాళం,హిందీ,తమిళ భాషల్లో కూడా’జిన్నా’సినిమా విడుదల చేయనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ స్వరాలు అందించనున్నారు.ఈ సినిమాకు ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు.

సెప్టంబర్ 9న జిన్నా సినిమాను టీజర్‌ను విడుదల చేశారు.టీజర్  ఓపెన్ చేయగానే”పెళ్ళి ధూమ్ ధాం గా చేస్తున్నావు వంటోళ్ళు  ఏడ  నుంచి అని రఘుబాబు అడగగా గుంటూరు నుంచి అని చెప్పగా మరి మేన గాళ్ళు…నెల్లూరు నుంచి అని చెప్పగా మరి టెంటు హౌస్ ఏడ నుంచని అడగగా జిన్నా టెంట్ హౌస్..మీ వాడే  అనగానే మంచు విష్ణు కనిపిస్తాడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ షాక్ అయి మీ వాడు తొందరగా రాడా అని అడగగా రఘుబాబు మా వాడు తొందరగానే వస్తాడు వచ్చే టప్పుడు బ్యాడ్ టైమ్ కూడా తీసుకొస్తాడని చెప్తాడు” అప్పుడు మంచు విష్ణు ” వీడేందిరా మనల్ని దొబ్బుతున్నాడు “అంటూ తన కామెడీ యాంగిల్ మనకి కనిపిస్తుంది.ఈ సినిమాలో రఘుబాబు, చమ్మక్ చంద్ర  వాళ్ళ  కామెడీతో ప్రేక్షకులను నవ్వించనున్నారని తెలుస్తుంది.టీజర్ వరకు బాగానే ఉంది ఇక సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో కొన్ని రోజులు వేచి చూడాలి.ఈ సినిమాను అక్టోబర్ నెలలో విడుదల చేయనున్నారని టీజర్‌లో  తెలిపారు.

Exit mobile version