Site icon Prime9

Manchu Vishnu : మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాలో మలయాళ సూపర్ స్టార్..

mammootty going to act in manchu vishnu kannappa movie

mammootty going to act in manchu vishnu kannappa movie

Manchu Vishnu : టాలీవుడ్ లో మంచు ఫ్యామిలికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ లు తమదైన శైలిలో దూసుకుపోతూ అలరిస్తున్నారు. కాగా ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా లో నటిస్తున్నారు. ఇటీవల అధికారికంగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మించబోతున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ గా నిలిచిన మహాభారత సిరీస్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ప్రముఖ సీనియర్ నటి మధుబాల ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మూవీలో ప్రభాస్ శివుడి పాత్రలో, నయనతార పార్వతిగా కనిపించబోతున్నట్టు చెప్పడంతో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.  కాగా గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు రావడం మరింత హాట్ టాపిక్ గా మారింది.

 

 

తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది టీం. కన్నప్ప సినిమాలో మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి కూడా ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్టు మంచు విష్ణు ప్రకటించారు. మమ్ముట్టితో మంచు విష్ణు దిగిన ఫోటోని ఓ సినిమా పిఆర్ షేర్ చేసి ఈ విషయాన్ని ప్రకటించగా మంచు విష్ణు దాన్ని రీ షేర్ చేసి కన్ఫర్మ్ చేశారు. దీంతో కన్నప్ప కోసం విష్ణు గట్టిగానే ప్లాన్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

పరుచూరి గోపాలకృష్ణ, విజయేంద్ర ప్రసాద్, తోటపల్లి సాయి నాథ్, తోట ప్రసాద్, నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్ రెడ్డి ఇలా అందరూ కలిసి ఈ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచినట్టుగా మంచు విష్ణు తెలిపారు. మోహన్‌బాబు నిర్మించే ఈ చిత్రంలో ఆయన కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, విజయేంద్ర ప్రసాద్, తోటపల్లి సాయి నాథ్, తోట ప్రసాద్, నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్ రెడ్డి ఇలా అందరూ కలిసి ఈ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచినట్టుగా మంచు విష్ణు తెలిపారు. మోహన్‌బాబు నిర్మించే ఈ చిత్రంలో ఆయన కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారని అంటున్నారు.

 

 

Exit mobile version