Site icon Prime9

Mahesh Babu: మరీ కాస్ట్లీ గురూ.. మహేష్ బాబు భార్య నమ్రత ఫుడ్ బిజినెస్

Mahesh Babu-Namrata's new restaurant is now open to public in banjarahills

Mahesh Babu: ప్రిన్స్, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు పేరువింటే చాలు అమ్మాయిల మనసులు అలా సంతోషంతో నిండిపోతాయి. మహేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మిల్కీబాయ్ మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 మూవీతో బిజీగా ఉన్నాడు. ఇటు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు దిగ్గజ వ్యాపారవేత్త రాణిస్తున్నాడు మహేష్. ఇప్పటికే తన పేరుతో ఏషియన్‌ మూవీ థియేటర్‌ను రన్‌ చేస్తున్నాడు. పలు పర్వ్యూమ్, మరియు క్లాతింగ్ బ్రాండ్స్ కి ఆయన ఎంబాసిడర్ గానూ ఉన్నారు.

అయితే తాజాగా మహేష్ ఫుడ్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. తన భార్య నమ్రత పేరు మీద రీసెంట్‌గా రెస్టారెంట్‌ ప్రారంభారు ప్రిన్స్. మినర్వా కాఫీ షాప్‌, ప్యాలెస్‌ హైట్స్‌ రెస్టారెంట్‌తో చేతులు కలిపిన మహేష్ నమ్రత ఏషియన్‌ గ్రూప్స్‌ ఏఎన్‌(AN) పేరు రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఇంకేముంది మహేశ్‌ రెస్టారెంట్‌ కావడంతో ఆయన ఫ్యాన్స్‌ అంతా ఆ రెస్టారెంట్ ముందు క్యూ కడుతున్నారు. అక్కడికి వెళ్లి విందును ఆస్వాదించేందుకు రెడీ అవుతున్నారు. అయితే మహేష్ రెస్టారెంట్‌ లో ఏం లభిస్తాయి మెను ఏంటి వాటి రేట్స్‌ ఎలా ఉన్నాయనే ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఏఎన్‌ రెస్టారెంట్‌కు సంబంధించిన ఓ మెను కార్డ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ మెను కార్డులో ఉదయం అల్పాహారం నుంచి సాయంత్రం స్నాక్స్‌ వరకు అన్ని అక్కడ రకాల వంటకాలు అందుబాటులో ఉన్నాయి.
ఇడ్లీ నుంచి సాయంత్రం పునుగుల, మిర్చిబజ్జీ ఇలా చాలా రకరకాల స్నాక్‌ ఐటెంస్ భోజన ప్రియులకు అందుబాటులో ఉన్నాయి.
మరి వాటి రేట్స్‌ ఎలా ఉన్నాయంటే ఒక ప్లేట్‌ ఇడ్లీ రూ. 90 నుంచి ముదలై రూ. 120 వరకు ఉన్నాయి. ఇక పూరీ ప్లేట్‌ రూ. 170 కాగా దోశ రూ. 120 నుంచి స్టార్ట్‌ అయ్యి రూ. 250 వరకు ఉంది. ఇక సాయంత్రం స్నాక్స్‌ రూ. 125గా ఉన్నాయి. ఏ స్నాక్స్‌ అయినా అక్కడ రూ. 125గానే ఉన్నాయి. ఇకపోతే బిర్యానీ మాత్రం రూ. 450 నుంచి ఉన్నట్లు సమాచారం. ఇక స్టాటర్స్‌, సూప్స్‌  అన్నీ కూడా రూ. 300పైనే ఉన్నాయి.

ఇదీ చదవండి: అల్లు అర్జున్ AAA రెడీ

Exit mobile version