Site icon Prime9

SS.Rajamouli : ’RRR‘ పై లాస్ ఏంజెల్స్ టైమ్స్ ప్రశంసలు

’RRR‘

’RRR‘

SS.Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి చిత్రం ’RRR‘ దేశంలోనే కాదు విదేశాల్లో కూడ సంచలనాన్ని సృష్టించింది. పలువురు హాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ చిత్రం పైన, రాజమౌళి టేకింగ్ పైన ప్రశంసలు కురిపించారు. ఇపుడు తాజాగా అమెరికాలో ఎక్కువ సర్కులేషన్ ఉన్న పేపర్స్‏లో ఒకటైన లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రికలో రాజమౌళి పై స్పెషల్ ఆర్టికల్ రాశారు.

RRR ఆస్కార్స్‌కు నామినేట్ అయ్యే అవకాశం ఉందని లాస్ ఏంజెల్స్ టైమ్స్ రిపోర్టర్ జెన్ యమటో రాసారు.ఎందుకంటే యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ వేరియన్స్ దాని కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు.. టాలీవుడ్‌లోని రెండు ప్రత్యర్థి సినీ కుటుంబాలనుండి ఇద్దరు వ్యక్తులను హీరోలుగా తీసుకుని భారతదేశ స్వాతంత్ర్య పోరాటం చుట్టూ యాక్షన్ డ్రామా ను రాజమౌళి తెరకెక్కించారంటూ కొనియాడారు.RRR యొక్క యాక్షన్ సీక్వెన్స్‌లు మరియు ఎమోషనల్ కంటెంట్‌పై రస్సో బ్రదర్స్ వంటి హాలీవుడ్ పెద్దలు గగ్గోలు పెట్టారని ఈ ఆర్టికల్ ప్రశంసించింది. జేమ్స్ కామెరూన్ మరియు స్టీవెన్ స్పీల్‌బర్గ్ వంటి దిగ్గజాల గురంచి రాసే పత్రికలో ఇపుడు రాజమౌళి గురించి ఆర్టికల్ రావడం అంటే రాజమౌళి నిజంగా టాలీవుడ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినట్లు అనిపిస్తుంది.

రాజమౌళి ఒక సాధారణ తెలుగు చిత్రానికి తన అద్భుతమైన సృష్టితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు కొత్త గుర్తింపును తెచ్చారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి RRR ను ఆస్కార్ కు నామినేట్ చేయడానికి రాజమౌళి చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతాయనే సినీ ప్రేమికులంతా ఆశిస్తున్నారు.

Exit mobile version