Site icon Prime9

Prabhas : వచ్చే దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటివాడిగా ఉంటాడు – ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి

krishnam raju wife shyamala devi interesting comments on Prabhas marriage

krishnam raju wife shyamala devi interesting comments on Prabhas marriage

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరూ అంటే ఠక్కున ప్రభాస్ అంటారు. ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ పెళ్ళి గత నాలుగేళ్ల క్రితమే జరగబోతోందని ప్రచారం జరిగింది. అయితే అప్పుడు ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చేస్తున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు నాలుగేళ్ళు సమయం కేటాయించాడు. ఈ సినిమా పూర్తి చేశాక ప్రభాస్ పెళ్ళి ఉంటుందని అందరూ భావించారు. కానీ బాహుబలి తర్వాత కూడా గ్యాప్ లేకుండా ప్రభాస్ సినిమాలు చేస్తూనే ఉంటున్నారు.

గతంలో అనుష్కతో పెళ్లంటూ చాలాకాలం పుకార్లు నడిచాయి. ఆదిపురుష్ సినిమా సమయంలో కృతిసనన్‌తో ప్రభాస్ ప్రేమలో పడ్డారని కూడా చెప్పుకున్నారు. అలాంటిదేమీ లేదని కృతిసనన్ క్లారిటీ ఇచ్చింది. కానీ అసలు ప్రభాస్ పెళ్లెప్పుడు చేసుకుంటారు ? అని నిత్యం ప్రశ్నలు వస్తూనే ఉంటున్నాయి. కాగా తాజాగా ప్రభాస్ పెళ్లి విషయంపై దివంగత నటుడు కృష్ణంరాజు భార్య.. శ్యామలాదేవి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

దసరా నవరాత్రుల్లో భాగంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. కృష్ణంరాజు గారు తమతో లేకపోయినా ఆయన పేరు నిలబెడుతూ తమ ఫ్యామిలీ ముందుకు వెళ్తోందన్నారామె. ప్రభాస్ పెళ్లి త్వరలోనే ఉంటుందని తను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని శ్యామలాదేవి చెప్పారు. అమ్మాయి ఎవరు? డేట్ ఎప్పుడు తెలియదు కానీ.. ఆ రోజు త్వరలోనే ఉందని స్పష్టం చేసారు. వచ్చే దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటివాడిగా ఉంటాడని శ్యామలాదేవి చెప్పడం ఫ్యాన్స్ కి సంతోషాన్ని ఇస్తుంది.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్  (Prabhas) చేస్తున్న చిత్రం “సలార్”. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు. టినూ ఆనంద్‌, ఈశ్వరి రావు, శ్రేయా రెడ్డి, మధు గురుస్వామి, పృథ్వీరాజ్‌, ఝాన్సీ, బ్రహ్మాజీ, జెమిని సురేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బ్రసూర్‌ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. `కేజీఎఫ్‌`ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్‌ చేయబోతున్నారు.

అయితే సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన సలార్‌ సినిమా అనూహ్యంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గానే డిసెంబర్ 22 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ మిగల్చడంతో అభిమానులంతా ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి దాకా ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దాంతో ఈ మూవీ రిలీజ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 

Exit mobile version