Site icon Prime9

Director Shankar: శంకర్ డైరెక్షన్లో రాకింగ్ స్టార్ యష్… క్రేజీ చిత్రం..

Yash with Shankar crazy movie

Yash with Shankar crazy movie

Director Shankar: దేశం గర్వించదగిన డైరెక్టర్ శంకర్ మరియు రాకింగ్ స్టార్ యష్ కాంబినేషన్లో ఓ సినిమా పడితే ఎలా ఉంటుంది అంటారు.. అదిరిపోలా ఊహకే అది అద్భుతంగా ఉంటే ఇంక సినిమా వస్తే ఎట్లుందంటారు… బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే కదా.. అయితే యష్ తదుపరి చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టంట చెక్కర్లు కొడుతుంది. శంకర్ దర్శకత్వంలో మన రాకింగ్ స్టార్ ఓ భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడంటూ కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ హీరో య‌ష్‌. ఇంక తెలుగునాట కూడా యష్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. క‌న్నడ హీరోల‌కు అంత‌గా గుర్తింపు లేని టైంలో భాష‌తో సంబంధంలేకుండా దేశ వ్యాప్తంగా విపరీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌రుచుకున్నాడు యష్. దక్షిణాది ఈ హీరో.. బాలీవుడ్ స్టార్ హీరోల‌కు స‌మంగా క్రేజ్ ని సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న ‘మ‌ఫ్టీ’ ఫేం నార్త‌న్‌తో తన తదుపరి చిత్రాన్ని చేయ‌బోయ‌తున్నాడు.ఇదిలా ఉంటే కేజీఎఫ్ ఫేం య‌ష్ తర్వాత సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

డైరెక్టర్ శంకర్ సినిమా చేయబోతున్నాడంటేనే ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తారు.. మరి స్టార్ హీరోలైతా ఈ డైరెక్టర్ తో ఒక్క చిత్రమైనా చెయ్యాలని ఆశిస్తుంటారు. కాగా ఇలాంటి ఓ లక్కీ ఛాన్స్ మన రాకింగ్ స్టార్ను వరించిందని కన్నడ నాట టాక్ వినిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ను నెట్‌ఫ్లిక్స్ అండ్ క‌ర‌ణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయట‌. ప్ర‌స్తుతం శంకర్ రామ్‌చ‌ర‌ణ్‌తో ‘Rc15’, క‌మ‌ల్ హాస‌న్‌తో ‘భారతీయుడు-2’ సినిమాలను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రాలను పూర్తి చేసిన త‌ర్వాత.. యష్ తో ప్రాజెక్ట్‌ను ప‌ట్టాలెక్కించనున్నట్టు సమాచారం. ఇక ఈ వార్త‌ల్లో నిజానిజాలేంటో తెలియలాంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

ఇదీ చదవండి: Hebah Patel: శాసనసభలో హెబ్బాపటేల్ స్పెషల్ సాంగ్

Exit mobile version