Site icon Prime9

Kannappa Movie : మంచు విష్ణు “కన్నప్ప” మూవీలో మరో స్టార్ హీరో.. ఈసారి కన్నడ నుంచి !

kannada star hero shivanna gong to act in manchu vishnu kannappa movie

kannada star hero shivanna gong to act in manchu vishnu kannappa movie

Kannappa Movie : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు.. తనదైన శైలిలో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా లో నటిస్తున్నారు. ఇటీవల అధికారికంగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ గా నిలిచిన మహాభారత సిరీస్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సీనియర్ నటి మధుబాల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మూవీలో ప్రభాస్ శివుడి పాత్రలో, నయనతార పార్వతిగా కనిపించబోతున్నట్టు చెప్పడంతో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. దానికి తోడు మలయాళం స్టార్ హీరో మోహ‌న్‌లాల్‌ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు రీసెంట్ గా అనౌన్స్ చేయడంతో అంచనాలు అన్నీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. ఇక అయిప్పుడు అందర్నీ మరింత షాక్ కి గురి చేసేలా ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా ఈ మూవీలో నటించబోతున్నాడట. దీంతో ఈ సినిమా పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఇక అసలు విషయనికి వస్తే.. కన్నడ స్టార్ హీరో ‘శివ రాజ్ కుమార్’ ఈ సినిమాలో భాగం కాబోతున్నాడట. ఈ మూవీలో శివన్న ఒక ముఖ్య పాత్ర చేయబోతున్నాడట. ఈ విషయాన్ని మంచి విష్ణు కూడా.. ‘హరహర మహాదేవ్’ అంటూ కన్ఫార్మ్ చేశాడు. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్ నుంచి స్టార్స్ ని తీసుకోవడం అయ్యిపోయింది. ఇప్పుడు హిందీ వంతు వచ్చింది. మరి బాలీవుడ్ నుంచి ఏ స్టార్ ఈ సినిమాలో భాగం అవుతాడో చూడాలి. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా ముందుగా బాలీవుడ్ ముద్దుగుమ్మ ‘నుపుర్ సనన్’ తీసుకున్నారు.

 

 

కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి సడన్ తప్పుకోవడంతో.. ఇప్పుడు ఆ రోల్ కోసం మరొకరిని వెతకాల్సి వస్తుంది. ఆ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పాన్ ఇండియా ఆడియన్స్ ని ఆకర్షించడానికి అన్ని భాషల స్టార్స్ ని కవర్ చేస్తున్నట్లు తెలుస్తుంది.  కన్నప్ప కోసం విష్ణు గట్టిగానే ప్లాన్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.  పరుచూరి గోపాలకృష్ణ, విజయేంద్ర ప్రసాద్, తోటపల్లి సాయి నాథ్, తోట ప్రసాద్, నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్ రెడ్డి ఇలా అందరూ కలిసి ఈ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచినట్టుగా మంచు విష్ణు తెలిపారు. మోహన్‌బాబు నిర్మించే ఈ చిత్రంలో ఆయన కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారని అంటున్నారు.

Exit mobile version