Jr NTR: ప్రతిషాత్మకం ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
బుధవారం తెల్లవారుజామున శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి చేరుకున్న ఎన్టీఆర్( Jr NTR) కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన ఆస్కార్ అందుకున్న క్షణాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అదే నా బెస్ట్ మూమెంట్( Jr NTR)
‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ ఆస్కార్ ను తీసుకున్న క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ఆస్కార్ 2023 లో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
స్టేజ్ పై కీరవాణి, చంద్రబోస్ అవార్డును అందుకున్న ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోను. అదే నా బెస్ట్ మూమెంట్.
మన దేశంలాగే ఆ అవార్డు కూడా ఎంతో గొప్పగా ఉంది. అద్భుతమైన ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేను.
ఇంతటి గౌరవాన్ని దక్కించుకున్నామంటే దానికి కారణం అభిమానులు, సినీ ప్రియులు. వాళ్ల ప్రేమ, ఆశీస్సుల వల్లే ఈ అవార్డు సాధ్యమైంది.
ఆస్కార్ వచ్చిన వెంటనే మొదటిగా నా భార్య ప్రణతికి ఫోన్ చేసి ఆనందాన్ని పంచుకున్నా.
ఆర్ఆర్ఆర్ ప్రోత్సహించిన ప్రతి ఇండియన్, ప్రతి సినీ అభిమానికి నా కృతజ్భతలు’అంటూ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.
Fans 💥
#JrNTR arrives hyd from oscars @tarak9999 pic.twitter.com/QLWSdPVnMZ— ARTISTRYBUZZ (@ArtistryBuzz) March 14, 2023
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే.
సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు.
నాటు నాటు పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసిన స్టెప్పులు ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేశాయి.
మొదటి స్టానంలో ఎన్టీఆర్
ఆస్కార్ అవార్డుల సందర్భంగా సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో అత్యధికంగా ప్రస్తావించిన నటుల జాబితా (టాప్ మేల్ మెన్షన్స్)లో
జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ 1 స్థానంలో నిలిచినట్టు సోషల్‌మీడియా విశ్లేషణ చేసే నెట్‌బేస్ క్విడ్ తెలిపింది. ఎన్టీఆర్ తర్వాత మెగా హీరో రామ్‌చరణ్ ఉన్నారు.
ఉత్తమ సహనటుడిగా అవార్డు దక్కించుకున్న ‘ఎవ్రీథింగ్’ నటుడు కె హుయ్ ఖ్యాన్, ఉత్తమ నటుడు బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్), అమెరికన్ యాక్టర్ పెడ్రో పాస్కల్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అలాగే అత్యధిక సార్లు ప్రస్తావించిన సినిమాగానూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ నిలిచింది.
ఆ తర్వాత ‘ది ఎలిఫెంట్ ‘విస్పరర్స్’, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’, ‘అర్జెంటీనియా 1985’ చిత్రాలు ఉన్నాయి.
ఇక ఫిమేల్ యాక్టర్స్ విషయానికొస్తే, మిషెల్ యో, లేడీ గాగా, ఏంజిలా బస్సెట్, ఎలిజిబెత్ ఓల్సెన్, జైమి లీ కర్టిస్‌లు ఉన్నారు.