Site icon Prime9

IT Raids : ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇంట్లో, ఆఫీసులో ఐటి సోదాలు..

it raids on producer abhishek agarwal house and office

it raids on producer abhishek agarwal house and office

IT Raids : ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇల్లు, కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల పలువురు ఇళ్లపై, ఆఫీసులపై వరుస ఐటి దాడులు జరుగుతున్న తరుణంలో టాలీవుడ్ లో కూడా వరుస దాడులు జరుగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో పలు సినిమాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కార్తికేయ 2 సినిమాతో కూడా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు.

ఇక ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో “టైగర్ నాగేశ్వరరావు” సినిమా చేస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కానుంది. కాగా ఇదే రవితేజకి మొదటి పాన్ ఇండియా సినిమాగా చెప్పాలి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 20వ తేదీన విడుదల కానుంది. ఇలాంటి టైంలో అభిషేక్ అగర్వాల్ ఇంట్లో, ఆఫీసులో ఐటి సోదాలు జరగడంతో చిత్ర యూనిట్ కంగారు పడుతున్నారు. అభిషేక్ అగర్వాల్ కూడా ఇంకా దీనిపై స్పందించలేదు.

Exit mobile version