OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో చెలరేగుతున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ లో.. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. కాగా పవన్ కళ్యాణ్, సాహో డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ఒరిజినల్ గ్యాంగస్టర్ (వర్కింగ్ టైటిల్). పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాత డివీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసింది.
ప్రభాస్ తో సాహో తర్వాత సుజిత్.. అలానే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ముంబై గ్యాంగ్ స్టర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ, తమిళ్ నటుడు అర్జున్ దాస్, శ్రీయారెడ్డిలు, మరి కొంతమంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ సినిమా టీజర్ ని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించారు. అందుకు సంబంధించి టీజర్ పోస్టర్ రిలీజ్ చేసి రాబోయే టీజర్ పై మరింత హైప్ పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. OG సినిమా టీజర్ ని అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో చెప్పించనున్నటు తెలుస్తుంది. ఇక ఈ టీజర్ ఒక దాపు 75 సెకన్లు పాటు ఉంటుందని సమాచారం అందుతుంది. అర్జున్ దాస్ గంభీరమైన వాయిస్ కి తమిళ్ తో పాటు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. దాంతో ఈ టీజర్ మరింత స్పెషల్ గా మారుతుందని అంతా భావిస్తున్నారు.
#OG glimpse
Duration – 72 secs
Voice Over – Arjun DasThe Fire Storm is coming🔥
||#TheyCallHimOG | #PawanKalyan | #OGTeaser|| pic.twitter.com/iIBSW8gTP0
— Manobala Vijayabalan (@ManobalaV) August 26, 2023