Site icon Prime9

Samantha – Naga Chaitanya : ఇన్ డైరెక్ట్ గా సమంత ఆ వార్తలకు చెక్ పెట్టిందా.. చై – సామ్ కలుస్తారా ???

interesting news about Samantha - Naga Chaitanya

interesting news about Samantha - Naga Chaitanya

Samantha – Naga Chaitanya : టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ నాగ చైతన్య – సమంత గురించి అందరికీ తెలిసిందే. అక్కినేని నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చి నాగ చైతన్య, సమంత.. ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. ఆ తర్వాత నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. కానీ వీరి జీవితం మూన్నాళ్ళ ముచ్చటగా మాత్రమే మిగిలిపోయింది.

మొదట్లో పెళ్లి తర్వాత ఈ జంట టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా నిలిచింది. పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి పలు సినిమాలలో, యాడ్స్ లలో నటించారు. కొన్ని రియాలిటీ షోలలో కూడా పాల్గొని చాలా కబుర్లు చెప్పుకున్నారు. ఇద్దరు కలిసి ట్రిప్స్ కు వెళ్తూ బాగా ఎంజాయ్ చేశారు. ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో సమంత, నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నామని ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంట ఎందుకు విడిపోయారు అనేది ఎవరికీ తెలియలేదు. సమంత, నాగచైతన్య (Samantha – Naga Chaitanya)  విడాకుల విషయం ఒక్కసారిగా టాలీవుడ్‌లో పెద్దగా సెన్సేషన్నే క్రియేట్ చేసింది. ఇప్పుడిప్పుడే ఈ విషయాన్ని మెల్లగా అందరూ మర్చిపోతున్నారు.

వీరు విడిపోతున్నట్లు ప్రకటించి దాదాపు 2 ఏళ్లు గడిచిన తరుణంలో ఇప్పటికీ వీరిద్దరు విడిపోవడాన్ని వారి అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇటీవల నాగచైతన్య- సామ్ మళ్లీ కలుసుకోబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. అందుకు బలాన్ని అందించేలా సమంత పెట్‌ డాగ్‌ హష్‌.. చైతూ దగ్గర కనిపించడంతో వారిద్దరూ మళ్లీ కలుస్తారన్నారంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. వారిద్దరూ కలిస్తే బాగుంటుందని అటు నాగచైతన్య ఫ్యాన్స్, ఇట్టు సమంత ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు ఇన్ డైరెక్ట్ గా ఈ వార్తలకు సమంత చెక్ పెట్టినట్లు తెలుస్తుంది.

రీసెంట్ గా సమంత సోషల్ మీడియాలో పింక్‌ డ్రెస్‌లో ఫోటోలను పంచుకుంది. ‍అయితే గతంలో షేర్ చేసిన ఫోటోల్లో సమంత బాడీపై అక్కినేని నాగచైతన్య టాటూ ఉండేది. ఈ సారి షేర్ చేసిన ఫోటోల్లో చైతూ టాటూ కనిపించకపోవడంపై ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. సామ్ నిజంగానే టాటూ తొలగించుకుందా? లేక టాటూ కనిపంచకుండా మేకప్ వేసిందా అని అంతా చర్చించుకుంటున్నారు.  చూడాలి మరి ఈ వార్తలపై వారు ఎలా స్పందిస్తారో అని..

Exit mobile version