Site icon Prime9

Last Film Show Oscar Entry: “ఆర్ఆర్ఆర్” కు భారీ షాక్… “ఆస్కార్” రేసులో గుజరాతీ “లాస్ట్ ఫిల్మ్ షో”

last film show movie selected to oscar race

last film show movie selected to oscar race

Gujarati Movie Last Film Show Oscar Entry: రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్‌ మూవీ అయిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భారీ వసూళ్లు సాధించటమే కాదు ఆస్కార్‌ రేసులోనూ నిలుస్తుందని చాలామంది అనుకున్నారు. ఈ విషయంపై కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా చర్చ జరిగింది. దీనితో కచ్చితంగా ఈ సినిమా ఆస్కార్​ రేసులో నిలుస్తుందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఊహించని క్రమంలో ఆర్​ఆర్​ఆర్​కు నిరాశ ఎదురైంది. తాజాగా భారత్ తరఫున ఆస్కార్ రేసులో గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ అధికారికి ఎంట్రీ ఇవ్వనుంది.

ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సహా వేర్వేరు భాషల్లోని 13 చిత్రాలు ఆస్కార్ కోసం పరిశీలనకు వెళ్లగా.. ‘ఛల్లో షో’ని ఆస్కార్‌ పోటీకి పంపాలని 17 మంది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు టీపీ అగర్వాల్‌ వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 12న 95వ ఆస్కార్‌ వేడుక జరగనుంది.

ఇంగ్లీష్​లో ‘లాస్ట్ ఫిల్మ్ షో’గా పిలుస్తున్న ఈ చిత్రానికి పాన్ నలిన్ దర్శకత్వం వహించాడు. 2021 అక్టోబర్ 14వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలైంది.
రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్​పై సిద్ధార్థ్ రాయ్ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జుగాడ్ మోషన్ పిక్చర్స్, మాన్​సూన్ ఫిల్మ్స్, ఛెల్లో షో ఎల్ఎల్​పీ, మార్క్ దువాలే సైతం ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. అయితే ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో ఓ కుర్రాడు తన కలను నెరవేర్చుకోడానికి ఎంత కష్ట పడ్డాడు అనే ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరక్కించారు.

ఇదీ చదవండి: Balakrishna: చెన్నకేశవ రెడ్డి వచ్చేస్తున్నాడు… థియేటర్లలో ఇంక రచ్చరచ్చే..!

Exit mobile version
Skip to toolbar