Site icon Prime9

Pushpa 2 : అల్లు అర్జున్ “పుష్ప 2” రిలీజ్ డేట్ ఫిక్స్.. రూలింగ్ ఎప్పటి నుంచి అంటే ?

icon star allu arjun pushpa 2 release date announced

icon star allu arjun pushpa 2 release date announced

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “పుష్ప – 2 “.  2021 లో రిలీజ్ అయిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ సినిమాలో కూడా బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొదటి పార్ట్ దాదాపు 350 కోట్ల కలెక్షన్స్ రాబట్టడంతో ఈ పార్ట్ ని తగ్గేదే లే అనే రేంజ్ లో నిర్మిస్తున్నారు.

పార్ట్-1 రిలీజ్ అయ్యి దాదాపు రెండేళ్లు పూర్తి అవ్వుతున్నాయి. ఇక ఇటీవల ఈ మూవీకి గాను జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ (Allu Arjun) బెస్ట్ యాక్టర్ అవార్డుని, దేవిశ్రీప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డుని అందుకున్నారు. దీంతో సీక్వెల్ పై మరింత క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలోనే తాజాగా నేడు రిలీజ్ డేట్ పై అనౌన్స్‌మెంట్ చేసి ఆడియన్స్ ని సర్‌ప్రైజ్ చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప గాడి రూల్.. వచ్చే ఏడాది ఆగష్టు 15 నుంచి మొదలు కాబోతుంది. ఆగష్టు 15 నుంచి 19 వరకు ఐదు రోజులు లాంగ్ వీకెండ్ కలిసి వస్తుంది. ఇక రిలీజ్ డేట్ తో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఫస్ట్ పార్ట్ తోనే ఓ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప.. ఇప్పుడు భారీ అంచనాలతో వస్తున్న ఈ సెకండ్ పార్ట్ తో ఎటువంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.

 

 

పార్ట్ 1 లో సునీల్, అజయ్ ఘోష్ ప్రతి నాయకులుగా కనిపించగా.. సెకండ్ పార్ట్ (Pushpa 2) లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ కి దేవిశ్రీ ఇచ్చిన సాంగ్స్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ సాంగ్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇక ఇటీవల ఇన్ స్టా లో బన్నీ ఓ స్పెషల్ పోస్ట్ ని షేర్ చేశాడు. మార్నింగ్ తన డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి పుష్ప 2 సెట్స్ లో షూటింగ్, ఆ లొకేషన్స్.. ఆ వీడియోలో చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో.. అల్లు అర్జున్ మార్నింగ్ తన డే స్టార్ట్ చేయడం దగ్గర్నుంచి.. సాయంత్రం వరకు ఏమేం చేస్తారనే చూపించారు. ముందుగా ఇంట్లోని గార్డెన్ లో యోగ చేయడం.. ఆ తర్వాత ఉదయం రోజు తన పిల్లలతో వీడియో కాల్ మాట్లాడటం.. అక్కడి నుంచి పుష్ప సెట్ కు వెళ్లడం.. షూటింగ్‏లో పాల్గొనడం చూపించారు. అలాగే ఆ వీడియోలో పుష్ప షూటింగ్ సెట్ లొకేషన్స్, హీరో క్యాస్టూమ్స్, కేరవాన్, ప్రాపర్టీస్ అన్నింటిని చూపిస్తూ.. డైరెక్టర్ సుకుమార్ తో ముచ్చటించారు.

Exit mobile version