Site icon Prime9

Guntur Kaaram Movie : మహేష్ బాబు “గుంటూరు కారం” నుంచి సాంగ్ రిలీజ్ అప్పుడే.. లీక్ ఎఫెక్ట్ !

Guntur Kaaram Movie song update by movie makers

Guntur Kaaram Movie song update by movie makers

Guntur Kaaram Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం “గుంటూరు కారం”.  ఈ సినిమాకి త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా చేస్తున్నారు. జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, జయరామ్, రమ్యకృష్ణ, సునీల్, బ్రహ్మనందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2024 జనవరి 12న సంక్రాంతి కానుగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న సినిమా ఇది. దాదాపు 12ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని మహేష్‌ ఊరమాస్‌ లుక్‌ అదిరిపోయింది.

కాగా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ మూవీ. ఈ సందర్భంగా ఫస్ట్ సింగిల్ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా విడుదలకు ఇంకా రెండు నెలలో సమయం ఉండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని ఇంకా స్టార్ట్ చేయలేదు. కానీ ఊహించని విధంగా ఈరోజు ఉదయం నుంచి ఈ మూవీ సాంగ్ లీక్ అయ్యి ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. లీక్ అయిందని మహేష్ ఫ్యాన్స్ అంతా ఒక సైడ్ ఫీల్ అవుతున్నప్పటికీ.. లిరిక్స్ మాత్రం అదిరిపోయాయని.. మాస్ సాంగ్ ఇచ్చాడని ఖుషి అవుతున్నారు.

 

 

“ఎదురొచ్చే గాలి… ఎగరేస్తున్నా చొక్కా పై గుండీ… ఎగబడి ముందరకే వెళ్ళిపోతాది నేనెక్కిన బండి. ధమ్ మసాలా… బిర్యానీ, ఎర్ర కారం… అర కోడి, నీంబు సోడా… ఫుల్ బీడీ, గుద్ది పారేయి గుంటూరునే” అంటూ సాగిన లిరిక్స్ లీక్డ్ సాంగ్ ని రిపీట్ మోడ్ లో వినేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇంకా ఆలస్యం చేస్తే సాంగ్ పై ఉన్న అంచనాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని మూవీ టీం దిద్దుబాటు చర్యలకు దిగారు.  ఈ క్రమం లోనే తాజాగా మూవీ యూనిట్ అధికారకంగా ఈ మాస్ సాంగ్ ప్రోమోను రేపు ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాస్ పోస్టర్ నూ రిలీజ్ చేశారు. మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్ పుట్టిన రోజు పురస్కరించుకొని నవంబర్7న మొదటి పాట పూర్తిగా రాబోతుందని తెలుస్తోంది.

Exit mobile version