Site icon Prime9

Rashmika Mandanna to get banned: నేషనల్ క్రష్ అధికారికంగా నిషేధించబడిందా?

Rashmika Mandanna to get banned

Rashmika Mandanna: ప్రస్తుతం దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో రష్మిక మందన్న ఒకరు.’పుష్ప: ది రైజ్’తో విజయం సాధించిన తర్వాత రష్మిక మందన్న చాలా బిజీ మారింది.ఆమె పాటలు ‘శ్రీవల్లి’ & ‘సామి’ కూడా చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి అలానే ఇప్పటికీ ట్రెండింగ్‌గా ఉన్నాయి. ఆమె ఇప్పుడు గుడ్‌బై, మిషన్ మజ్ను మరియు యానిమల్ చిత్రాలతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది.అయితే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. నివేదికలను విశ్వసిస్తే, కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి నిర్మాణ సంస్థకు కృతజ్ఞత చూపనందుకు రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమచే నిషేధించబడుతోంది అని తెలుస్తుంది.

రష్మిక మందన్న ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఇంకా తాను “కాంతర” సినిమా చూడలేదని, అంతా టైమ్ లేదని చెప్పడంతో ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. అంతే కాకుండా ఆమె నటిగా మారడానికి తన ప్రయాణం గురించి మాట్లాడింది. నటన అనేది తన మనసులో ఎప్పుడూ లేదని మరియు ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన తన మొదటి సినిమా కిరిక్ పార్టీని ఎలా పొందిందో గురించి ఆమె మాట్లాడుతున్నప్పుడు, ఆమె తన మాజీ కాబోయే భర్త రక్షిత్ శెట్టి సహ-స్థాపన చేసిన ప్రొడక్షన్ హౌస్ పరమ్‌వా స్టూడియోస్ పేరును ప్రస్తావించలేదు.

అటు రిషబ్‌ శెట్టి సైతం రష్మికపై పరోక్షంగా కామెంట్స్‌ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో కన్నడ ఇండస్ట్రీలో రష్మికను బ్యాన్‌ చేయనున్నారంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బ్యాన్‌ చేసేంత తప్పు రష్మిక ఏం చేయలేదని వెనకేసుకొస్తున్నారు ఆమె అభిమానులు. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ కన్నడిగులు ఆమె మీద ఆగ్రహంతో ఊగిపోతున్న మాట వాస్తవమనే తెలుస్తోంది.

Exit mobile version