Site icon Prime9

Prabhas: ఆదిపురుష్ హీరోయిన్ తో ప్రభాస్ డేటింగ్..?

Kriti sanon wants to marry Prabhas if she gets chance

Kriti sanon wants to marry Prabhas if she gets chance

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియని వారుండరు. పాన్ ఇండియా లెవల్లో ఈ హీరోకి ఉన్న క్రేజ్ అంతాఇంత కాదు. అనేక సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు ఈ హీరో. ప్రస్తుతం ఈ టాలీవుడ్ హీరో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అప్పట్లో ప్రభాస్ ప్రముఖ హీరోయిన్ అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నాడనే పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా,  ప్రభాస్‌ బాలీవుడ్ హీరోయిన్‌తో కలిసి డేటింగ్ చేస్తునట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరు.. ఈ వార్తలు వాస్తమేనా కాదా అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్‌కు జంటగా కృతిసనన్ నటిస్తోన్న విషయం విధితమే. కాగా ఇటీవల బాలీవుడ్ ప్రముఖ షో అయిన కాఫీ విత్ కరణ్ షో 7వ సీజన్‌లోని కార్యక్రమంలో ఆదిపురుష్ టీం పాల్గొంది. అయితే ఈ షోలోకి వచ్చిన సెలబ్రిటీ అయిన కృతిని తమ సెలబ్రిటీ ఫ్రెండ్స్‌లో ఒకరికి కాల్ చేయమని కరణ్ అడగగా.. ఆమె ప్రభాస్‌కు కాల్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనితో కృతి ప్రభాస్ డేటింగ్లో ఉన్నారంటూ టాక్ వినిపిస్తుంది. అంతే కాకుండా సెట్‌లో కూడా వీరిరువురూ చాలా క్లోజ్‌గా ఉంటారని తెలుస్తుండడంతో వీరి డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. కాగా ఈ విషయాన్ని కావాలనే కొందరు పుకార్లు పుట్టిస్తున్నారని ప్రభాస్ అభిమానులు అంటున్నారు.

ఇదీ చూడండి: Samantha Shakuntalam: సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్… శాకుంతలం నుంచి దుష్యంతుడి పోస్టర్ రిలీజ్

Exit mobile version
Skip to toolbar