Site icon Prime9

Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్ “హరి హర వీరమల్లు” మూవీ సెట్ లో అగ్ని ప్రమాదం.. ఎంత నష్టం జరిగిందంటే ?

fire accident in pawan kalyan harihara veeramallu movie set

fire accident in pawan kalyan harihara veeramallu movie set

Hari Hara Veeramallu : పవర్ స్టార్  పవన్‌ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో క్రిష్ జాగర్లమూడి కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం “హరి హర వీర మల్లు” కూడా ఒకటి. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియన్ మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పలువురు టాలీవుడ్, బాలీవుడు తారాగణం ప్రముఖ పాత్రలు పోషించనున్నారు.

అయితే ఈ సినిమా సెట్ లో నిన్న ( మే 28 ) అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం అందుతోంది. మూవీ యూనిట్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని.. మంటలను ఆర్పేశారు. గతంలో వర్షానికి సెట్ కూలగా తాజాగా దానికి మరమత్తులు చేసే క్రమంలో వెల్డింగ్ వర్క్ చేస్తుండగా ఫైర్ ఆక్సిడెంట్ జరిగిందని అంటున్నారు. ఇక ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ ఘటన గురించి పూర్తి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక ఈ చిత్రంలో ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. అదే విధంగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం. ఎం కీరవాణి మూవీకి సంగీతం అందించడం మరో ప్రత్యేక విషయం అని చెప్పాలి. అయితే దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభం అయిన ఈ సినిమా కరోన వల్ల కొంత ఆలస్యం అవ్వగా.. పవన్ రాజకీయాలు, ఇతర సినిమాల కారణంగా మరింత ఆలస్యం అవుతూ వచ్చింది. కాగా షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ ఈ సినిమా కోసం మరోసారి సింగర్ అవతారం ఎత్తానున్నారని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

ముఖ్యంగా డైరెక్టర్ క్రిష్ పవన్ తో ఒక పాట పాడించాలని అనుకుంటున్నాడట. గతంలో పవన్ కళ్యాణ్ ఆయన నటించిన పలు సినిమాలో పాటలు పాడి అలరించారు. అవి ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో మళ్ళీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయాలని క్రిష్ మళ్లీ పవన్ ను ఓ పాటకు సింగర్ చేయాలనుకుంటున్నాడట. దీనికి పవన్ కూడా పాట పాడడానికి అంగీకరించారని సమాచారం అందుతుంది.

Exit mobile version