Site icon Prime9

Vijay Devarakonda: లైగర్ కు సీక్వెల్.. విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీమ్ ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. బాలీవుడ్ మీడియా పోర్టల్‌తో ఇంటరాక్షన్ సందర్భంగా, ఈ చిత్రం సీక్వెల్ సాధ్యమేనని విజయ్ కన్ ఫర్మ్ చేసాడు.

విజయ్ దేవరకొండ కాఫీ విత్ కరణ్ చాట్ షోలో పాల్గొన్నాడు. బాహుబలిని దేశం మొత్తం చేరేలా చేసింది కరణ్ జోహార్ అని విజయ్ చెప్పాడు. నేను హైదరాబాద్ నుండి వచ్చాను, నా డైరెక్టర్ పూరీ సార్ ఏపీలోని నర్సీపట్నం అనే చిన్న పట్టణం నుండి వచ్చారు. కరణ్ మా కథను ఇష్టపడి మాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడని అని విజయ్ అన్నాడు. ఈ చిత్రానికి ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుంది. అయితే దాని గురించి ఇపుడు మాట్లాడకూడదని అన్నాడు. ఛార్మీ కౌర్, పూరీ జగన్ సంయుక్తంగా లైగర్ చిత్రాన్ని నిర్మించారు. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రేక్షకులకు అందిస్తున్నారు.

Exit mobile version