Site icon Prime9

Hero Ajith: 81 రోజుల్లో 7 ఖండాలు, 62 దేశాలు.. హీరో అజిత్ క్రేజీ టూర్..!

hero ajith kumar crazy bike tour

hero ajith kumar crazy bike tour

Hero Ajith: తమిళంలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలోనూ మంచి స్టార్ డమ్ ఉన్న నటుల్లో అజిత్ కుమార్ ఒకరు. ఈయనకు మంచి దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రహీరోగా వెలుగొందుతున్న అజిత్‌‌కి బైక్‌‌పై ప్రయాణాలు చేయడం అంటే అమితమైన ఇష్టం.

ఇక ఈయన కాస్త ఖాళీ దొరికితే చాలు బైక్ పై చక్కర్లు కొడతారు. షూటింగ్‌ సమయంలో ఏమాత్రం గ్యాప్‌ దొరికిన బైకుపై చుట్టు పక్కల ఉండే ప్రాంతాలను చుట్టివస్తారు.
ఇలాంటి స్టార్ హీరో బైక్ ప్రయాణానికి సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సాల్ట్ పెప్పర్ హెయిర్ స్టైల్ హీరో బైక్ రైడింగ్ గురించి ఓ క్రేజీ వార్తల హల్‌చల్ అవుతుంది. అజిత్ 81 రోజుల్లో 7 ఖండాలు, 62 దేశాలను చుట్టేలా ఓ సుదీర్ఘ బైక్‌ జర్నీకి ప్రణాళిక రూపొందిస్తున్నారట. దీని కోసం ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయట. అయితే అజిత్ తాజాగా హెచ్. వినోద్ దర్శకత్వంలో నటించిన చిత్రం తుణివు సంక్రాంతికి తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి: బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ రికార్డులను బద్దలు కొట్టిన “కాంతార”.. దేశంలోనే @1

Exit mobile version