Site icon Prime9

Nagarjuna: ఆ సినిమా చూస్తూ కన్నీరు పెట్టుకున్న కింగ్ నాగార్జున

King Nagarjuna shed tears watching that movie

Nagarjuna: యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ఒకే ఒక జీవితం‘. అయితే చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రమోషన్స్‌ ను వేగంగా చేపడుతుంది. దీనిలో భాగంగా టాలీవుడ్‌ సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్‌ షో వేశారు. మూవీ చూసిన టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున థియేటర్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారంటా… తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఏడ్చేశానని ఆయన తెలిపారు.

ఈ సినిమాలో అక్కినేని అమల, శర్వానంద్ తల్లీకొడుకుగా నటించారు. శ్రీ కార్తీక్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటించారు. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్‌ కానుంది.

‘ఒకే ఒక జీవితం చిత్రం కుటుంబ సమేతంగా అందరూ చూడదగిన చిత్రం అని దర్శకుడు సినిమాను చాలా అందంగా తీశారని కింగ్ నాగార్జున చెప్పుకొచ్చారు. తల్లి సెంటిమెంట్‌ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం చూసిన వారుఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటారని… నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చి థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్నానని ఆయన తెలిపారు. ప్రీమియర్‌ షో చూసిన నాగార్జున ‘ఒకే ఒక జీవితం’ చిత్ర బృందాన్ని అభినందించారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం నాగ్ కన్నీరు పెట్టుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Exit mobile version