Site icon Prime9

Manoj Bajpayee : ఫ్యామిలీ మ్యాన్ హీరో ” మనోజ్ ” ఇంట తీవ్ర విషాదం

family man web series actor manoj mother passed away

family man web series actor manoj mother passed away

Manoj Bajpayee : ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మనోజ్ బాజ్‌పాయి. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తెలుగులో సుమంత్ హీరోగా చేసిన ప్రేమ కథ సినిమాలో నటించారు. ఆ తర్వాత తెలుగు లోనూ అల్లు అర్జున్ , జెనీలియా జంటగా వచ్చిన ‘హ్యాపీ’… క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ – మంచు మనోజ్ కలిసి నటించిన ‘ వేదం ‘ , పవన్ కళ్యాణ్ నటించిన ‘పులి’ సినిమాలతో ఆడియన్స్ కి మరింత చేరువయ్యారు.

కాగా ఇప్పుడు మనోజ్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన తల్లి గీతాదేవి ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 80 సంవత్సరాలు. గీతాదేవికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గతేడాది అక్టోబర్‌లో మనోజ్ తన తండ్రి ఆర్‌కె బాజ్‌ పాయిని కోల్పోయారు. ఆ ఘటన నుంచి కోలుకోక ముందే, మళ్ళీ ఇలా జరగడంతో మనోజ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

గతంలో పలు ఇంటర్వ్యూలో మనోజ్.. తన తల్లి ప్రతి విషయంలో సలహాలు ఇచ్చేదంటూ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఆమె మరణ వార్త తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

Exit mobile version