Site icon Prime9

Dhamaka: ధమాకా చిత్రం నుంచి జింతాక్ సాంగ్ రిలీజ్

Tollywood: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ధమాకా చిత్రం నుంచి నిర్మాతలు జింతాక్ అనే మాస్ సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాటలో రవితేజ, శ్రీలీలల మేకోవర్, మాస్ స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

కాసర్ల శ్యామ్ మాస్ ను ఆకట్టుకునే విధంగా పాట రాయగా భీమ్స్ సిసిరోలియో మరియు మంగ్లీ పాటకు పూర్తి న్యాయం చేసారని చెప్పవచ్చు. రవితేజ, శ్రీలీల ఇద్దరూ మంచి డ్యాన్సర్లని మనకు తెలుసు. వీరిద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Exit mobile version