Site icon Prime9

Animal Movie Trailer : అరాచకానికి బ్రాండ్ నేమ్ లాగా “యానిమల్” ట్రైలర్.. మరీ వైలెంట్ గురూ !

details about ranbheer kapur animal movie trailer

details about ranbheer kapur animal movie trailer

Animal Movie Trailer :బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా యానిమల్ . ఈ సినిమా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్ 1న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతుంద. ఇప్పటికే యానిమల్ సినిమా టిజర్ రిలీజ్ అయ్యింది . టిజర్ జనాలలో మంచి ఆదరణ పొందింది . అండర్ వరల్డ్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.అలాగే ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బబ్లూ పృథ్వీరాజ్, బాబీ డియోల్.. మరింతమంది బాలీవుడ్ స్టార్స్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు.

బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న విడుదల కానుంది. రీసెంట్ గా ఈ మూవీ సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ర‌న్ టైమ్ విషయానికి వస్తే 3 గంట‌ల 21 నిమిషాల 23 సెక‌న్లు అంటూ ద‌ర్శ‌కుడు తెలియ‌జేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని 3 నిమిషాల లాంగ్ నిడివితోనే రిలీజ్ చేశారు.

ట్రైలర్ మొత్తం ఫాదర్ అండ్ సన్ బాండింగ్ చుట్టూనే తిరిగింది. ఎమోషన్ తో పాటు యాక్షన్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. సినిమా మొత్తం హిందీ యాక్టర్స్ తోనే నిండిపోయినప్పటికి సౌత్ నేటివిటీకి తగ్గట్టు మూవీ ఉన్నట్లు తెలుస్తుంది. ట్రైలర్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ తో సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి. సందీప్ వంగా డైరెక్షన్ కావడంతో తెలుగులో కూడా భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ మూవీతో సందీప్ వంగా ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.

Exit mobile version