Site icon Prime9

Break Out: ‘బ్రేక్ అవుట్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Break out

Break Out

Break Out: కామెడీ కింగ్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాడు. అతని చివరి చిత్రం 2018లో వచ్చిన’మను’. అయితే రాజా గౌతమ్ ఈ చిత్రంతో విజయాన్ని అందుకోలేకపోయాడు ఇప్పుడు అతను తన కొత్త చిత్రంతో ప్రేక్షకులముందుకు వస్తున్నాడు.

రాజాగౌతమ్ నటిస్తున్న ‘బ్రేక్ అవుట్’ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. పోస్టర్‌లో తీవ్ర వేదనలో కనిపించిన రాజా గౌతమ్ కిటికీలోంచి అరుస్తున్నాడు. అతనిపై గాయాలు కూడా ఉన్నాయి.ఈ చిత్రం రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం ‘ట్రాప్డ్’కి రీమేక్ కావచ్చునని టైటిల్ మరియు ఫస్ట్ లుక్ సూచిస్తున్నాయి, అయితే ఇది స్ట్రెయిట్ ఫిల్మ్ కాదా అనేది స్పష్టంగా తెలియలేదు.

‘బ్రేక్ ఔట్’ సినిమాకి రచన, దర్శకత్వం సుబ్బు చెరుకూరి. ఈ చిత్రాన్ని నిర్మాత అనిల్ మోదుగ నిర్మించారు. రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశముంది.

Exit mobile version