Site icon Prime9

Bramhastra Movie: బ్రహ్మాస్త్రం దెబ్బకు… పీవీఆర్ షేర్లు డమాల్

Bramhastra movie prime9 news

Bramhastra movie prime9 news

Bramhastra movie: బ్రహ్మాస్త్రం సినిమా తనతో పాటు పీవీఆర్, ఐనాక్స్ యొక్క పెట్టుబడిదారులనూ నష్టాల్లోకి నెట్టేలా కనిపిస్తోంది. ఈ సినిమాకు వచ్చిన రివ్యూలు బ్రహ్మాస్త్రం అవకాశాలపై నీరుపోయడంతో.. భారతదేశంలోనే అతిపెద్ద థియేటర్ చైన్‌లు కలిగి ఉన్న పీవీఆర్ మరియు ఐనాక్స్ షేర్లు పతనం అయ్యాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో నేడు ₹800 కోట్లకు పైగా నష్టపోయాయి.

బ్రహ్మాస్త్రం సినిమా విడుదలకు ముందు ₹23 కోట్ల విలువైన అడ్వాన్స్ బుకింగ్‌లతో పీవీఆర్, ఐనాక్స్ యొక్క షేర్లు బాగా పెరిగాయి. అయితే ఈ మూవీలో అంత కంటెంట్ లేదంటూ సినీ విశ్లేషకుల రివ్యూలు రాగానే పీవీఆర్ మరియు ఐనాక్స్ పెట్టుబడులు భారీగా పతనమయ్యాయి. ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్… ఈ చిత్రానికి 2స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు. ఈ చిత్రం కింగ్ సైజ్ లో నిరాశపరిచిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జోడీగా అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున మరియు షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించి.. ఇటీవలె విడుదలైన చిత్రం బ్రహ్మాస్త్రం. కాగా ఈ సినిమాపై ఫ్లాప్ టాక్ ఉంది. ₹410 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడిన బ్రహ్మాస్త్ర సినిమాకు కరణ్ జోహార్ కూడా నిర్మాతగా వ్యవహరించారు.

ఇదీ చదవండి: Brahmastra Twitter Review: బ్రహ్మాస్త్ర సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది !

Exit mobile version