Site icon Prime9

Kriti Sanon: ప్రభాస్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కృతి

Kriti Sanon On Dating Rumours With Prabhas

Kriti Sanon On Dating Rumours With Prabhas

Kriti Sanon: టాలీవుడ్‌ డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంత కాలంగా నెట్టింట వార్తలు మారుమోగుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాలీవుడ్‌, బాలీవుడ్‌ మీడియాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి స్నేహాన్ని ఉద్దేశించి బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చాయి. కాగా ఈ వార్తలపై తాజాగా కృతి నోరువిప్పింది. కృతి, వరుణ్‌ నటించిన ‘భేడియా’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ‘కృతి పేరు మరొకరి గుండెల్లో ఉంది. ప్రస్తుతం అతను ముంబయిలో లేడు. దీపికా పదుకొణెతో షూటింగ్‌ నేపథ్యంలో వేరే ప్రాంతంలో ఉన్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్. దీంతో అభిమానులు ప్రభాస్ కృతి మధ్య నిజంగానే ప్రేమ ఉందని అనుకున్నారు.

అయితే ఈ వార్తలపై కృతి సనన్‌ తాజాగా స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని. అవన్నీ రూమర్స్‌ మాత్రమే అని కొట్టి పారేశారు. ‘భేడియా ప్రమోషన్స్‌లో వరుణ్‌ ధావణ్‌ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. కొన్ని వెబ్‌సైట్లు నా పెళ్లి తేదీని కూడా ప్రకటించాయి. అందుకే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇవన్నీ ఎలాంటి ఆధారాలు లేని పుకార్లు మాత్రమే’ అని ఇన్‌స్టా వేదికగా ఈ బాలీవుడ్ భామ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: ఈడీ ముందు హాజరైన రౌడీ బాయ్.. లైగర్ విషయంలో విజయ్ పై విచారణ

Exit mobile version
Skip to toolbar