Site icon Prime9

Adipurush: మరో 100 కోట్ల రూపాయలు పెరుగుతున్న ఆదిపురుష్ బడ్జెట్

Adipurush

Adipurush

Bollywood: ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. టీజర్‌ పై నెటిజన్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ పై మేకర్స్ నిజంగా సీరియస్‌గా మారారని బాలీవుడ్ వర్గాల సమాచారం. దీనితో విఎఫ్ఎక్స్ వర్క్‌ పై మళ్లీ పని చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.

ఈ చిత్రానికి 100 కోట్ల రూపాయల కొత్త బడ్జెట్‌ను కేటాయించారు. దీనితో మొత్తం సినిమా బడ్జెట్ ఇప్పుడు 600 కోట్ల రూపాయలకు చేరుకుంది. సైఫ్ అలీ ఖాన్ లుక్ కొత్తగా ఉంటుంది. ఆదిపురుష్‌లోని వానరసేన ఎపిసోడ్‌లు సరిదిద్దబడతాయి. ఈ చిత్రం జూన్ 2023లో విడుదల కానుంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. టి సిరీస్ మరియు రెట్రోఫిల్స్ నిర్మాతలు.

ఈ సినిమా టీజర్ నెల రోజుల క్రితం విడుదలైనప్పుడు, సినిమా విజువల్ ఎఫెక్ట్స్‌పై భారీ విమర్శలు వచ్చాయి. హీరో ప్రభాస్ కూడా ఈ సినిమాలో ఒరిజినల్ కాదని కొందరు అభిప్రాయపడ్డారు. అలాగే హనుమాన్ పాత్ర యొక్క నడక శైలి మరియు అతని వానరసేన పై వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు మొదట్లో విమర్శలను కొట్టిపారేసినప్పటికీ, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్‌లను అందించాల్సిన అవసరాన్ని  అర్థం చేసుకున్నాడు.

 

Exit mobile version