Site icon Prime9

Abhishek Bachchan: రతన్ టాటా గా అభిషేక్ బచ్చన్ ?

Abhishek Bachchan as ratan tata

Bollywood News: డెక్కన్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ బయోపిక్‌ సూర్య హీరోగా ఆకాశమే నీహద్దురా పేరుతో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా దర్శకురాలు సుధా కొంగర తాజాగా వ్యాపారవేత్త రతన్ టాటా బయోపిక్ ను రూపొందిస్తారని వార్తలు వచ్చాయి.

సుధా కొంగరతో పాటు కెజిఎఫ్, హోంబలే ఫిల్మ్స్ మరియు హీరోలు అభిషేక్ బచ్చన్ మరియు సూర్య కలిసి ఈ సినిమా చేస్తారని బాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ .టెట్లీ టీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ గ్రూప్ మరియు యూరప్ యొక్క స్టీల్ దిగ్గజం కోరస్‌లను కొనుగోలు చేసిన తర్వాత రతన్ టాటా విజయవంతమైన వ్యాపారవేత్తగాఖ్యాతిని పొందారు.

అభిషేక్ బచ్చన్ తెరపై టాటా పాత్రను పోషించే అవకాశముందని తెలుస్తోంది. ఇంతకుముందు అతను ధీరూభాయ్ అంబానీ పాత్రను పోషించిన విషయం తెలిసిందే. అందువలన అతను మరో వ్యాపార వేత్త పాత్రను పోషించిన ఘనతను పొందుతాడు.

Exit mobile version