Site icon Prime9

Pawan Kalyan : పవర్ స్టార్ మూవీలో మరో బిగ్ బాస్ బ్యూటీ..? ఆ లక్కీ ఛాన్స్ రతికాకేనా ?

big boss rathika in pawan kalyan movie news gone viral

big boss rathika in pawan kalyan movie news gone viral

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలను ,రాజకీయాలను రెండింటిని బాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు . అయితే ప్రస్తుతం ఆయన రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి రెండు సినిమాలలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి గొప్ప అవకాశం వచ్చినట్టు ఒక వార్త మారుమోగిపోతుంది . నిజానికి సోషల్ మీడియా లో ఫెమస్ అయిన సెలెబ్రేటీలను బిగ్ బాస్ లోకి తీసుకొని వస్తున్నారు షో యాజమాన్యం. బాస్ రియాలిటీ షో లోకి అడుగుపెట్టి, మంచి ఫేమ్ ని సంపాదించుకొని, ఆ తర్వాత సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు.. గతంలో వచ్చిన సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ లోకి కంటెస్టెంట్స్ కి అవకాశాలు బాగానే వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే ముందు రతికా రోజ్ బాలయ్య బాబు భగవంత్ కేసరి చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సీజన్ లో కుర్ర కారుల్లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది రతికా. తన అందంతో ఎందరో హృదయాలను కాజేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ భామ పవన్ కళ్యాణ్ సినిమా అయిన ఉస్తాద్ భగత్ సింగ్ లో నటించే ఛాన్స్ కొట్టేసినట్టు తెగ వార్తలు వస్తున్నాయి. అదే నిజం అయితే తన కెరీర్ ఎటో వెళ్ళిపోతుంది. అలాగే మరో కంటెస్టెంట్ శుభ శ్రీ.. 5 వ వారంలో హౌస్ నుంచి బయటకు వచ్చింది.. ఈమె బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి అడుగుపెట్టగానే పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం షూటింగ్ లో పాల్గొనడం, దానికి సంబంధించిన ఫోటోలను ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చెయ్యడం వంటివి చూసి అందరూ ఆశ్చర్యపోయారు.. ఏకంగా పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేయ్యడంతో అందరు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

ఇదిలా ఉండగా గత వారం లో ఎలిమినేట్ అయిన మరో కంటెస్టెంట్ అశ్వినీ కూడా పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఒక కారెక్టర్ అనుకుంటున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే గతం లో ఆమె పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం లో ముఖ్య పాత్ర పోషించింది.కాగా ఈ సారి రతికనే ఎంచుకుంటారు అని అందరూ అనుకుంటున్నారు.మరి ఈ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి. ఇలా వరుసగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి పవన్ కళ్యాణ్ సినిమాల్లో అవకాశాలు దక్కడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు..

Exit mobile version