Site icon Prime9

Balakrishna: చెన్నకేశవ రెడ్డి వచ్చేస్తున్నాడు… థియేటర్లలో ఇంక రచ్చరచ్చే..!

20 years of balakrishna chennakeshavareddy movie

20 years of balakrishna chennakeshavareddy movie

Balakrishna: ఇటీవలె కాలంలో బాక్సాఫీస్ వద్ద రీ-రిలీజ్ల పర్వం కొనసాగుతుంది. కాగా తమ అభిమాన స్టార్ హీరోల సినిమాలను రి-రిలీజ్ చేస్తూ అభిమానులు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజున ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా, తమ్ముడు వంటి సినిమాలను స్పెషల్ షోలుగా రీ-రిలీజ్ చేశారు అభిమానులు.. కాగా ఇప్పుడు ఆ వరుసలో బాలయ్యబాబు కూడా చేరాడు. మెన్ ఆఫ్ మాసెస్ గా చెప్పుకునే బాలయ్యబాబు చెన్నకేశవరెడ్డి చిత్రం విడుదలయ్యి రెండు 20ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ సినిమాను మరోమారు ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చూస్తున్నారు.

బాలయ్య కెరీర్‌లో ఊరమాస్ చిత్రంగా నిలిచిన ‘చెన్నకేశవ రెడ్డి’ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్లు పూర్తవుతుండటంతో, ఇప్పుడు ఈ సినిమాను మరోసారి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు అభిమాలనులు భారీగా ప్లాన్ చేస్తున్నారు. చెన్నకేశవ రెడ్డి సినిమాను యూఎస్‌లో స్పెషల్ షోల రూపంలో రీ-రిలీజ్ చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాను సెప్టెంబర్ 24, 25 తేదీల్లో అక్కడ స్పెషల్ షో వేయనున్నట్లు బాలయ్య యూస్ అభిమానులు ప్రకటించారు. దీనికి గాను 30 థియేటర్లు కూడా బుక్ అయినట్లు వారు పేర్కొన్నారు. మరికొన్ని థియేటర్లు కూడా యాడ్ కాబోతున్నాయని.. అలాగే, ఏపీ-తెలంగాణ, చెన్నైల్లోనూ ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు బాలయ్యబాబు ఫ్యాన్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రం రీ-రిలీజ్‌తో థియేటర్లలో బాలయ్య ఎలాంటి రచ్చ చేస్తాడో వేచిచూడాల్సిందే.

ఇదీ చదవండి: Megastar Chiranjeevi: “నేను రాజకీయానికి దూరం కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు” అంటున్న చిరంజీవి

Exit mobile version