Last Updated:

బాబూ జగ్జీవన్ రామ్: వెండితెరపై బాబూ జగ్జీవన్ రామ్ బయోపిక్.. సినిమా పేరేంటో తెలుసా..?

గతంలో అంబేడ్కర్ జీవిత చరిత్రను చిత్రీకరించిన దర్శకుడు దిలీప్ రాజా ప్రస్తుతం మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబూ జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు.

బాబూ జగ్జీవన్ రామ్: వెండితెరపై బాబూ జగ్జీవన్ రామ్ బయోపిక్.. సినిమా పేరేంటో తెలుసా..?

Babu Jagjivanram: గతంలో అంబేడ్కర్ జీవిత చరిత్రను చిత్రీకరించిన దర్శకుడు దిలీప్ రాజా ప్రస్తుతం మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబూ జగ్జీవన్ రామ్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు.” బాబూజీ ” టైటిల్ తో గుంటూరు జిల్లా తెనాలి పరిసర ప్రాంతాల్లో ఈ బయోపిక్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ బి రామాంజనేయులు తొలి క్లాప్ ఇవ్వగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లిడ్ కాప్ అధ్యక్షులు కాకుమాను రాజ శేఖర్ కెమేరా స్విచ్ ఆన్ చేశారు. జగ్జీవన్ రామ్ కుమార్తె, లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పాత్రను సీనియర్ నటి తాళ్లూరి రామేశ్వరి పోషిస్తుండగా టైటిల్ రోల్ ను మిలటరీ ప్రసాద్ చేస్తున్నారు.

స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీజీ అనుచరుడిగా సత్యాగ్రహల్లో పాల్గొని బ్రిటీష్ జైళ్లల్లో గడిపిన రోజుల్లో జరిగిన సంఘటనలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు.ఇందులో సుభాష్ చంద్ర బోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మాలవ్య,జవహర్ లాల్ నెహ్రూ,బాబూ రాజేంద్ర ప్రసాద్,భగత్ సింగ్ ,ఇందిరా గాంధీ పాత్రలు కీలకంగా వుంటాయని దర్శకుడు చెప్పారు.రెండవ షెడ్యూలును బీహార్ లోని చాంద్వ గ్రామంలో చిత్రీకించనున్నట్లు తెలిపారు. జగ్జీవన్ రామ్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన భారత్,పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధం సన్నివేశాలను కాశ్మీర్ బోర్డర్ లో చిత్రీక రిస్తామని ఇందుకోసం అక్కడి అధికారుల అనుమతి కోరినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి: