Site icon Prime9

Rashmika Mandanna : వైరల్ గా “రష్మిక మందన్నా” వీడియో.. స్పందించిన అమితాబ్

amithabh responds on Rashmika Mandanna viral video

amithabh responds on Rashmika Mandanna viral video

Rashmika Mandanna : “రష్మిక మందన్నా”.. నేషనల్ క్రష్ గా మారి ఆడియన్స్ ఆదరాభిమానాలు పొందిన ఈ భామ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్ లో ఉందని చెప్పాలి. నాగశౌర్య తో “ఛలో” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో నటించిన “పుష్ప” సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. ఈ మూవీతో దక్షిణాది లోనే కాకుండా ఉత్తరాది లోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ అయ్యింది.

అయితే తాజాగా రష్మికకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో రష్మిక (Rashmika Mandanna) డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ లో లిఫ్ట్ లోకి వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రష్మిక తన ఎద అందాలని బాగా ఎక్స్‌పోజింగ్ చేసినట్టు కనిపిస్తుంది. దీంతో అభిమానులు షాక్ అయ్యారు. రష్మిక ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడం ఏంటని షాక్ అయ్యారు. కాగా ఇది ఫేక్ వీడియో అని తేల్చేశారు. అసలు సదరు వీడియో జారా పటేల్ (Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కి సంబంధించినదని తేల్చేశారు.

 

 

దీనిపై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా స్పందిస్తూ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరారు. అయితే దీనిపై రష్మిక (Rashmika Mandanna) ఇంకా స్పందించక పోవడం గమనార్హం. పలువురు ఒరిజినల్ వీడియో, రష్మిక మార్ఫింగ్ వీడియో షేర్ చేసి నిజాన్ని బయటపెట్టారు. దీంతో రష్మిక అభిమానులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ ని కోరుతున్నారు. ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా – రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వస్తున్న “యానిమల్” లో నటిస్తుంది. ఇక వచ్చే ఏడాది అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న “పుష్ప 2” తో రాబోతుంది. అలానే ఈ ముద్దుగుమ్మ చేతిలో మరో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నట్టు సమాచారం.

 

 

Exit mobile version