Site icon Prime9

Pushpa 2 : అల్లు అర్జున్ శ్రీవల్లీ సాంగ్ స్టెప్ పై అమితాబ్ బచ్చన్ కామెంట్..

amithabh Bachchan comments on allu arjun pushpa song step

amithabh Bachchan comments on allu arjun pushpa song step

Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమాలోని డైలాగ్స్, మ్యానరిజమ్స్, సాంగ్స్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ మూవీలోని ‘శ్రీవల్లి’ సాంగ్ స్టెప్ గురించి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వైరల్ కామెంట్స్ చేశారు.

అమితాబ్ హోస్ట్ గా నిర్వహిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ రియాలిటీ షో సీజన్ 15 జరుగుతుంది. రీసెంట్ గా జరిగిన ఒక ఎపిసోడ్ లో 2023లో బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు అందుకున్న నటుడు ఎవరు..? అని ప్రశ్నించగా.. కంటెస్టెంట్ అల్లు అర్జున్ అని బదులిచ్చారు. అనంతరం అమితాబ్ పుష్ప( Pushpa 2)సినిమా గురించి మాట్లాడుతూ.. “పుష్ప సినిమా చూశారా, చాలా బాగుంటుంది. మూవీలోని సాంగ్స్ కూడా చాలా ఫేమస్” అంటూ చెప్పుకొచ్చారు.

 

“ఆ సినిమాలోని ఒక సాంగ్ చెప్పు వదిలేసి వేసే స్టెప్పు ఉంటుంది. చెప్పు వదిలేసినా వైరల్ అవుతుందా..? అని చూడడం నా కెరీర్ లోనే మొదటిసారి” అంటూ వ్యాఖ్యానించారు. అమితాబ్ చేసిన ఈ కామెంట్స్ ని అల్లు అర్జున్ అభిమానులు నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. ఇక పుష్ప 2 విషయానికి వస్తే.. ఈ మూవీ కోసం యావత్ సినీలోకం ఎంతో ఆతృతతో ఎదురుచూసేలా చేస్తున్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగా ఏప్రిల్ 7న విడుదలైన పుష్ప 2 టీజర్ చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. పార్ట్ 1 లో సునీల్, అజయ్ ఘోష్ ప్రతి నాయకులుగా కనిపించగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ క్లైమాక్స్ లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పడు పార్ట్ 2 లో ఆయనే మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

ఈ టీజర్ పుష్ప-2 సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఊరమాస్ లుక్ లో ఉన్న బన్నీ అవతారం చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆడియన్స్ అంచనాలకు మించి టీజర్ ఉండడంతో ఈసినిమాపై బాగా హైప్ క్రియేట్ అయ్యింది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని సుకుమార్ మొదటి భాగాన్ని మించి తెరకెక్కిస్తున్నారు. ఈ సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది ఆగష్టు ఆగష్టు 15న రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది.

Exit mobile version