Site icon Prime9

Pushpa 2 : పుష్ప 2 ఘాట్ నుంచి పిక్స్ లీక్.. మెగాస్టార్ అభిమానిగా అల్లు అర్జున్.. విలన్ ఎవరో తెలిసిపోయిందిగా !

allu arjun as megastar fan in pushpa-2 and movie shooting pics leaked

allu arjun as megastar fan in pushpa-2 and movie shooting pics leaked

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం “పుష్ప – 2 “. పుష్ప – పార్ట్ 1.. 2021 లో రిలీజ్ అయ్యి ఊహించని రీతిలో భారీ సక్సెస్ సాధించింది. దాదాపు 350 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి.. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. ఇక ఇప్పుడు అదే రేంజ్ లో తగ్గేదే లే అనేట్టు పార్ట్ 2 ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కూడా బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగష్టు 15 న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

పార్ట్ 1 లో సునీల్, అజయ్ ఘోష్ ప్రతి నాయకులుగా కనిపించగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ క్లైమాక్స్ లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పడు పార్ట్ 2 లో ఆయనే మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. కాగా పార్ట్-1 రిలీజ్ అయ్యి దాదాపు రెండేళ్లు పూర్తి అవ్వుతున్నాయి. ఇక ఇటీవల ఈ మూవీకి (Pushpa 2) గాను  అల్లు అర్జున్ (Allu Arjun) బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డుని పొందగా.. ఈ అవార్డు అందుకున్న మొదటి తెలుగు నటుడిగా రికార్డ్ సెట్ చేశాడు. అలానే దేవిశ్రీప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డుని అందుకున్నారు. దీంతో సీక్వెల్ పై మరింత క్రేజ్ పెరిగింది.

Image

అయితే తాజాగా పుష్ప 2 షూటింగ్ నుంచి లీక్ అయిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. అందులో అల్లు అర్జున్.. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ గా కనిపిస్తుండడం ఫుల్ కిక్ ఇస్తుంది. 2000 లో రలిజ్ అయిన మెగాస్టార్ “ఇంద్ర” సినిమా ఇండస్ట్రి హిట్ గా నిలిచింది. పుష్ప కథ కూడా 2000 సంవత్సరంలో జరుగుతుండడంతో ఇంద్ర సినిమా రిఫరెన్స్ ని వాడినట్లు కనబడుతుంది. పుష్పరాజ్ యువసేన అని బ్యానర్లు,, కేశవ అండ్ ఫ్రెండ్స్ అని బ్యానర్లు కనబడుతున్నాయి. దీంతో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సాధారణంగానే అల్లు అర్జున్ ఐ మెగాస్టార్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఇక సినిమాలో కూడా అభిమానిగా కనిపిస్తుండడం మరింత కిక్ ఇస్తుంది అని చెప్పాలి.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే పార్ట్ 1 లో పుష్ప స్నేహితుడిగా ఉండే కేశవ.. పార్ట్ 2 లో పుష్ప కి వెన్నుపోటు పొడిచి విలన్ గా మారతాడని సోషల్ మీడియాలో వార్తలు కోడై కూస్తున్నాయి. ఇప్పుడు ఇక ఈ ఫ్లెక్సీ లలో కూడా విడివిడిగా ఫోటోలు ఉండడం ఆ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.

 

 

 

Exit mobile version
Skip to toolbar